Minister Roja Visited Suryalanka Beach: మంత్రి రోజా.. సూర్యలంక బీచ్ పర్యటన వివాదాస్పదమైంది. గురువారం పర్యాటక శాఖ రిసార్ట్స్ వద్ద మంత్రికి అధికారులు స్వాగతం పలికి బీచ్ వద్దకు తీసుకెళ్లారు. ఆమె సముద్రపు నీటిలోకి దిగేముందు ఒడ్డున చెప్పులు విడవగా, వాటిని జాగ్రత్తగా చూడాలని రోజా వ్యక్తిగత సహాయకుడు సిబ్బందిని ఆదేశించారు. స్థానిక రిసార్ట్స్ ఉద్యోగి శివనాగరాజు మంత్రి చెప్పులను కొద్దిసేపు చేత్తో మోసి తర్వాత పక్కన పెట్టారు. బీచ్‌లో నుంచి తిరిగొచ్చిన మంత్రి.. చెప్పులు వేసుకుని రిసార్ట్స్‌కు వెళ్లారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలైంది. దీనిపై చిరుద్యోగి శివనాగరాజు స్పందిస్తూ ‘మంత్రి చెప్పులు పట్టుకోవాలని నాకు ఎవరూ చెప్పలేదు. అలలకు నీరు ముందుకొచ్చి చెప్పులు కొట్టుకుపోతాయని నేనే చేత్తో తీసి పక్కన పెట్టాను. చేతితో చెప్పులు ఎందుకు పట్టుకున్నావని మంత్రి మందలించార’ని తెలిపారు.
మంత్రి గారి చెెప్పులు.. ప్రభుత్వ ఉద్యోగి చేతిలో.. - రోజా మేడం గారి చెప్పులు జాగ్రత్త
Minister Roja Visited Suryalanka Beach: మంత్రి రోజా సూర్యలంక బీచ్‌ను సందర్శించారు. అక్కడికి వెళ్లిన రోజా వివాదంలో చిక్కుకున్నారు. రాజుల కాలాన్ని గుర్తు చేశారు. అది కాస్తా వీడియో రూపంలో నెట్టింట చక్కర్లు కొడుతోంది.
కారులోంచే పరిశీలన:సూర్యలంక బీచ్ సమీపంలో పర్యాటక శాఖ భూములను మంత్రి పరిశీలించాల్సి ఉండగా.. ఎండగా ఉందంటూ కారులోంచే చూశారు. పుష్పగుచ్ఛాలు స్వీకరించేందుకు మాత్రమే కారు దిగారు. రిసార్ట్స్ వద్ద విలేకర్లతో మాట్లాడుతూ విశాఖ తర్వాత అందమైన తీరం సూర్యలంకలో ఉందని, పర్యాటక శాఖకు కేటాయించిన 8 ఎకరాల్లో త్వరలో రిసార్ట్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని చెప్పారు. చిరంజీవి కేంద్ర పర్యాటక మంత్రిగా ఉన్నప్పుడు అతిథిగృహ నిర్మాణానికి శంకుస్థాపన చేసినప్పటికీ పనులు ప్రారంభించలేదని విలేకర్లు ప్రస్తావించగా.. నిధుల లభ్యతను దృష్టిలో ఉంచుకొనే శంకుస్థాపన చేసి ఉండాల్సిందన్నారు. బీచ్‌లో మహిళలు దుస్తులు మార్చుకోవడానికి గదులు, ఇతర సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. మంత్రి వెంట ఎమ్మెల్యే కోన రఘుపతి ఉన్నారు.
ఇవీ చదవండి