Minister Merugu Nagarjuna Comments: నారా లోకేశ్ పాదయాత్రను ఎక్కడికక్కడ అడ్డుకుంటామని.. మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్న చంద్రబాబు మాటలకు..లోకేశ్ సమాధానం చెప్పి తీరాలని డిమాండ్ చేశారు. అంబేడ్కర్ విగ్రహం వద్ద ముక్కును నేలకు తాకాలని.. లేదంటే లోకేశ్ పాదయాత్ర ను పల్లె పల్లెల్లోనూ అడ్డుకుని తీరుతామని మంత్రి నాగార్జున హెచ్చరించారు. లోకేష్ చేపట్టనున్న పాదయాత్ర యువ గళమా, నారా గరళమా అంటూ మంత్రి రోజా ప్రశ్నించారు. కరోనా కష్ట కాలంలో పక్క రాష్ట్రంలో దాక్కున్న వారు.. ఏ మొహం పెట్టుకొని పాదయాత్ర చేస్తారని మండిపడ్డారు.
" నువ్వు పాదయాత్ర చేసే ముందు.. రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులకు సమాధానం చెప్పాలి.. చంద్రబాబు.. ఈ దళిత కులం ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్న మాటకు సమాధానం చెప్పి..మా పల్లెల్లో ఓట్లు అడగడానికైనా..నడవడానికైనా రా..! ఖచ్చితంగా ప్రతీ చోట పాదయాత్రను ఆపిస్తా..చాలెంజ్ చేసి చెప్తున్నాను.. ప్రతీ దళితుడు అంబేద్కర్వాధి..జగజ్జీవనుడు..ఆలోచనాపరుల.. మన కులాన్ని తేలికగా తీసిన చంద్రబాబు..తన కుమారుడు లోకేష్ పాదయాత్ర చేస్తున్నాడు..పల్లెలకు వస్తే నిలదీయండి..అందుకు సమాధానం చంద్రబాబు ముందు చెప్పాలి.. అంబేడ్కర్ విగ్రహం వద్ద ముక్కును నేలకు రాస్తే తప్ప ఊళ్లలో తిరగనియ్యం ..దాంట్లో ఆలోచించేది లేదు.."మంత్రి మేరుగు నాగార్జున