Volunteer suicide in Bapatla district: బాపట్ల జిల్లా పర్చూరు మండలం చెన్నంబొట్ల అగ్రహారంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామ వాలంటీర్‌గా విధులు నిర్వర్తీస్తున్న బెజ్జం కెనడి(23) అనే యువకుడు ఈరోజు ఉదయం 8 గంటల ప్రాంతంలో క్రిమిసంహారిక మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గమనించిన బంధువులు, స్థానికులు వాలంటీర్ కెనడిని హూటాహుటిన 108లో చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే యువకుడి పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
బాపట్ల జిల్లాలో విషాదం.. పురుగుల మందు తాగి వాలంటీర్ ఆత్మహత్య - పురుగుల మందు తాగి వాలంటీర్ ఆత్మహత్య
Volunteer suicide in Bapatla district: ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు తట్టుకోలేక గ్రామ వాలంటీర్‌గా విధులు నిర్వర్తీస్తున్న బెజ్జం కెనడి(23) అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన బంధువులు, స్థానికులు హూటాహుటిన 108లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు.
వాలంటీర్ ఆత్మహత్య
సమాచారం అందుకున్న పర్చూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కెనడి.. తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్తూ జీవనం సాగిస్తున్నారు. కుటుంబంలో రోజురోజుకు ఆర్ధిక ఇబ్బందులు తలెత్తుండడంతో వాటిని తట్టుకోలేకే కెనడీ ఆత్మహత్యకు పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు తెలిపారు. తమ కష్టాలను తీరుస్తాడని ఎన్నో కలలు కన్న తల్లిదండ్రులకు.. చేతికందిన కుమారుడు మృతి చెందడంతో కన్నీరుమున్నీరు అయ్యారు.
ఇవీ చదవండి