ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మద్యం మత్తులో భార్యను నరికి చంపిన భర్త - ఏపీ తాజా వార్తలు

Woman Murder: మద్యం మత్తులో ఉన్న ఓ భర్త.. భార్యని అతికిరాతకంగా నరికి హత్య చేశాడు. ఈ ఘటన బాపట్ల జిల్లా నిజాంపట్నం మండలంలో జరిగింది. కుటుంబ కలహాల కారణంగా ఇద్దరు పిల్లలకు తల్లిని దూరం చేశాడు. అమ్మ లేవకపోవడంతో ఏం జరిగిందో అని అర్థం కాక మృతదేహం వద్ద చిన్నారుల రోదన అందరినీ కలచివేసింది.

The husband killed his wife
భార్యను నరికి చంపిన భర్త

By

Published : Dec 3, 2022, 8:29 PM IST

Woman Murder: బాపట్ల జిల్లా నిజాంపట్నం మండలం ఆముదాలపల్లి గ్రామంలో దారుణం జరిగింది. మద్యం మత్తులో భార్యను భర్త నరికి హత్య చేశాడు. ఆటో డ్రైవర్ అయిన నర్రా నాగరాజుకు(27) భార్య రమాదేవికి (21) మధ్య కొద్ది కాలంగా కుటుంబ కలహాలు ఉన్నాయి. అయితే శనివారం నాగరాజు మద్యం తాగి రావడంతో ఇద్దరి మధ్య మరోసారి గొడవ జరిగింది.

రమాదేవి పుట్టిల్లు పక్కనే అవ్వడంతో పిల్లలను తీసుకుని వెళ్ళిపోయింది. సాయంత్రం భార్య వద్దకు వచ్చిన భర్త కత్తితో మెడ పై నరికాడు. దీంతో రమాదేవి అక్కడికి అక్కడే మృతి చెందింది. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాల వలనే హత్య జరిగినట్లు స్థానికులు, పోలీసులు అనుమానిస్తున్నారు. మృతురాలికి పాప, బాబు ఉన్నారు. అమ్మ లేవకపోవడంతో ఏం జరిగిందో అని అర్థం కాక మృతదేహం వద్ద చిన్నారుల రోదన అందరినీ కలచివేసింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details