Hijras protest in Banjarahills police station: తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో హిజ్రాలు ఆందోళన చేశారు. కొన్ని ప్రాంతాలను ఎంచుకుని నకిలీ హిజ్రాలు కూడా వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రౌడీలతో తమపై దాడులు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను వేధిస్తున్న హిజ్రా నాయకురాలు మోనాలిసాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
హిజ్రాల గ్యాంగ్ వార్.. బంజారాహిల్స్ పీఎస్లో గలాటా - బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్‌లో తాజా వార్తలు
Hijras protest in Banjarahills police station: తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరంలో హిజ్రాలు ఎక్కువగా ఉండడంతో.. అందులో నిజమైన హిజ్రాలు, హిజ్రాలు కానివాళ్లు కూడా వసూళ్లు చేస్తున్నారు. దీంతో వారి మధ్యే తగాదాలు వచ్చి.. బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. స్టేషన్‌లోనే కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకొని కేసు నమోదు చేశారు.
![హిజ్రాల గ్యాంగ్ వార్.. బంజారాహిల్స్ పీఎస్లో గలాటా Conflict between Hijra gangs](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-17312575-0-17312575-1672035595420.jpg)
హిజ్రా గ్యాంగుల మధ్య వివాదం
స్టేషన్‌లోనే కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించగా పోలీసులు వారిని అడ్డుకుని ఐపీసీ 353, 306, 511 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉందని వీటిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.
బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో హిజ్రాల ఆందోళన
ఇవీ చదవండి:
Last Updated : Dec 26, 2022, 5:00 PM IST