Bapatla: మతిస్థిమితం లేని మనవడు నాయనమ్మని చంపిన ఘటన బాపట్ల జిల్లా అమర్తలూరు మండలంలో జరిగింది. ఇంటూరు గ్రామానికి చెందిన సీతారావమ్మ(70) అనే వృద్ధురాలికి నలుగురు కొడుకులు ఉన్నారు. వృద్ధురాలు మతిస్థిమితం లేని మనవడు భాస్కర్ (32)తో కలిసి ఉంటూ బాగోగులు చూసుకుంటోంది. అయితే ఆదివారం అర్ధరాత్రి నిద్రపోతున్న సమయంలో నాయనమ్మపై భాస్కర్ గొడ్డలితో వేటు వేశాడు.. వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందింది. ఉదయం గమనించిన స్థానికులు.. మృతదేహాన్ని, పక్కనే ఉన్న మతిస్థిమితం లేని భాస్కర్‌ను చూసి బంధువులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. పెద్ద కుమారుడు ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు భాస్కర్‌ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు.
మతిస్థిమితం లేని మనవడి చేతిలో నాయనమ్మ బలి
Bapatla: మతిస్తిమితం లేని మనవడుతో కలిసి ఉంటూ.. తన బాగోగులు చూసుకుంటుంది ఓ నాయనమ్మ.. కాని ఆ మనవడే యవపాశమై నాయనమ్మను అనంత లోకాలకు పంపిన ఘటన బాపట్ల జిల్లాలో చోటుచేసుకుంది.
బాపట్ల