ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Ganja Smugglers Arrest: అంతర్​ జిల్లాల గంజాయ విక్రయ ముఠా అరెస్టు.. 55కేజీలు స్వాధీనం - Ganja Smugglers Arrest news

Ganja Smuggling Gang Arrest in Bapatla: బాపట్ల జిల్లాలో గంజాయి విక్రయిస్తున్న అంతర్ జిల్లా ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. 26 మంది నుంచి 6లక్షలు విలువ చేసే 55 కేజీల గంజాయి, ఇన్నోవా కారు స్వాధీనం చేసుకున్నారు.

Ganja Smugglers Arrest
Ganja Smugglers Arrest

By

Published : Jul 16, 2023, 10:50 AM IST

అంతర్​ జిల్లాల గంజాయ విక్రయ ముఠా అరెస్టు

Ganja Smuggling Gang Arrest in Bapatla: బాపట్ల జిల్లాలో గంజాయి విక్రయిస్తున్న అంతర్ జిల్లాల ముఠా సభ్యులు 26 మందిని అరెస్టు చేసి.. ఆరు లక్షల రూపాయల విలువైన 55 కేజీల గంజాయి, ఇన్నోవా కార్​ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వకుల్​ జిందాల్​ తెలిపారు. ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో నిందితుల అరెస్టు వివరాలను ఆయన వెల్లడించారు. మార్టూరు మండలం నాగరాజుపల్లికి చెందిన ప్రధాన నిందితుడు బిళ్లా ప్రకాష్.. నాలుగు సంవత్సరాలుగా అనకాపల్లికి చెందిన బాలాజీ గోవిందు నుంచి గంజాయి కొనుగోలు చేసి జిల్లాకు తెచ్చి వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకున్న ఏజెంట్ల ద్వారా విక్రయిస్తూ అక్రమార్జనకు పాల్పడుతున్నాడని తెలిపారు.

అల్లూరి సీతారామరాజు జిల్లా జి. మాడుగుల ప్రాంతానికి చెందిన సింహాచలం, అనకాపల్లికి చెందిన స్వామి ఒడిశా నుంచి గంజాయి తెప్పించి గోవిందుకి విక్రయిస్తున్నారన్నారు. అతడి నుంచి ప్రకాష్ బంధువు, అనకాపల్లికి చెందిన రాజు దుర్గాప్రసాద్ సేకరిస్తున్నాడని వివరించారు. ప్రకాష్ ఇన్నోవా కారును అద్దెకు తీసుకొని తన ముఠా సభ్యులైన గోపనబోయిన కృష్ణవంశీ, సుధీర్, రాజేంద్రప్రసాద్, గలంకి వినయ్ కుమార్, దేవరకొండ హరీష్, బాచిరెడ్డి సుధీర్ కుమార్ రెడ్డితో కలిసి అనకాపల్లి వెళ్లి దుర్గాప్రసాద్ నుంచి 60 కిలోల గంజాయి కొని వేటపాలెంకి వచ్చారన్నారు.

వేటపాలెం బైపాస్​లో ఉన్న రాజీవ్​ స్వగృహ కాలనీ వద్దకు తన ఏజెంట్లు ఇంకొల్లుకు చెందిన బిష్ణుదేవ్​ ప్రసాద్, జె.పంగులూరుకు చెందిన పురిమెట్ల ఆనంద్​, మార్టూరుకు చెందిన జనరాజుపల్లి తిరుమల, స్టూవర్టుపురానికి చెందిన పిరిగి కళ్యాణి, బోయినవారిపాలెంకు చెందిన పిరిగి రోజాలను శనివారం పిలిపించి 20 కిలోల గంజాయి విక్రయించారని తెలిపారు. ఉప్పు గోపి, ఉప్పు వెంకటేష్, పెంట్యాల కృష్ణమోహన్, జనరాజుపల్లి సతీష్, షేక్ రఫీ, షేక్ ఇమ్రాన్, షేక్ నాజర్ వలీ, పృథ్వి యాగాబాబు, యశ్వంత్ వెంకట సాయి, మంత లోకేష్, శ్యాంప్రసాద్, సూరగాని రోహిత్, కండి సాయి కిరణ్ రెడ్డి, చింతంకింది సతీష్​కు కిలో చొప్పున, ఒంగోలుకు చెందిన కడియం మనోజ్​కి 100 గ్రాములు గంజాయి విక్రయించారని వెల్లడించారు.

నిఘావర్గాలు అందించిన సమాచారం మేరకు చీరాల గ్రామీణ సీఐ మల్లికార్జునరావు, ఎస్సైలు సురేష్, జనార్దన్, పోలీసు సిబ్బందితో కలిసి దాడి చేసి నిందితులను పట్టుకొని అరెస్టు చేసి గంజాయి సాధన చేసుకున్నారన్నారు. కాగా, జిల్లాలో గంజాయి విక్రయాలపై ఉక్కుపాదం మోపినట్లు ఎస్పీ తెలిపారు. ఈ కేసులో మరో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేయాల్సి ఉందన్నారు. పరారీలో ఉన్న వారిని త్వరలో పట్టుకొని జైలుకు పంపిస్తామన్నారు. గంజాయి రవాణా చేసినా.. విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కేసులో ఉన్న 156 మంది పైన స్పస్పెక్ట్ షీట్లు తెరిచామని, ఈ ఏడాది ఇప్పటివరకు 35 కేసుల్లో 146 మందిని అరెస్టు చేసినట్లు ఐదుగురుపై పీడీ చట్టాన్ని ప్రయోగించినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details