Four Police Officers Suspended: అధికార వైసీపీ నేతలతో కుమ్మక్కై.. తటస్థులు, ప్రతిపక్షాల సానుభూతిపరులు, మద్దతుదారుల ఓట్ల తొలగింపు కుట్రలో భాగస్వాములైన బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలోని పోలీసులపై.. ఆ శాఖ ఉన్నతాధికారులు మొక్కుబడి చర్యలతో సరిపెట్టేశారు. ఎన్నికల సంఘం నిబంధనల్ని ధిక్కరించి మరీ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ(Voters List Amendment Process)లోకి అక్రమంగా చొరబడి తీవ్ర నేరానికి పాల్పడ్డ పోలీసులను సర్వీసు నుంచే తొలగించాల్సి ఉండగా సస్పెండ్(Four Police Officers Suspended) చేసి మమ అనిపించేశారు.
సస్పెన్షన్ వేటుతో సరిపెట్టేశారు: మార్టూరు సీఐ టి.ఫిరోజ్, పర్చూరు, యద్దనపూడి, మార్టూరు ఎస్సైలు ఎన్‌సీ ప్రసాద్, కె.కమలాకర్, కె.అనూక్‌లను తొలుత వేకెన్సీ రిజర్వు(Four Police Officers to VR)లోకి పంపిస్తూ ఆదేశాలిచ్చారు. దీనిపై ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు రావటంతో తప్పనిసరి పరిస్థితుల్లో సస్పెండ్ చేశారు. ఓటర్ల జాబితాలో అక్రమాలు, అవకతవకల(Irregularities and manipulations in Voter List)కు తెరలేపిన వైసీపీ నేతల(YCP Leaders)కు సహకరిస్తూ.. బీఎల్వోలపై ఒత్తిడి తీసుకొచ్చిన పోలీసు అధికారులను సస్పెండ్ చేసి సరిపెట్టేయటం ఏంటనే ప్రశ్నలు తలెతత్తుతున్నాయి.
Four Police Officers to VR: ఓటరు జాబితా సవరణలో జోక్యం.. నలుగురు పోలీసు అధికారులపై చర్యలు
వెల్లువెత్తుతున్న విమర్శలు: మిగతాచోట్ల ఈ తరహా ఘటనలకు ఎవరూ పాల్పడకుండా హెచ్చరించేలా కఠిన చర్యలు తీసుకోకుండా మమ అనిపించేయటమేంటనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓటర్ల జాబితాలో అక్రమాలకు సహకరించినందుకు వీరిపైన చర్యలు తీసుకుంటున్నట్లు కాకుండా పరిపాలన కారణాల రీత్యా చర్యలు తీసుకుంటున్నట్లు మాత్రమే ఉత్తర్వుల్లో పేర్కొనడంపై అనుమానాలు కలుగుతున్నాయి. వారి సర్వీసు రికార్డులోకి ఈ అక్రమాల వివరాలు ఎక్కకుండా కాపాడేందుకేనా అనే వాదనలు వినిపిస్తున్నాయి.