ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కాల్వపూడిక తీయించరా..! ఆలకించేవారు లేరంటూ.. అన్నదాతల ఆర్తనాదాలు! - news on bapatla district news

Farmer's problems: బాపట్ల జిల్లా అప్పికట్ల, భర్తిపూడి, బాపట్ల ప్రాంతాల్లో మర్రిపూడి డ్రైన్ నిర్వహణను 2016 నుంచి అధికారులు గాలికి వదిలేశారు. గుర్రపుడెక్క, తూటుకాడ, పూడిక పేరుకుపోవడంతో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని రైతులు వాపోతున్నారు. ఈసారైనా కాల్వలను బాగు చేసి సాగునీరు అందించాలని వేడుకుంటున్నారు.

Farmers
Farmers

By

Published : Mar 3, 2023, 6:04 PM IST

Farmers problems in bapatla district: పంట ఎప్పుడు పండుతుందో .. ఎప్పుడు పండుతుందో తెలియని పరిస్థితి. ఒక్కోసారి సాగునీరు లేక అన్నదాతలు ఇబ్బందులు పడితే... సాగునీరు కాల్వల రూపంలో పక్కనే ఉన్నా పంటపొలాలకు అందని పరిస్థితి నెలకొంది. గుర్రపుడెక్కలు, తూటి కాడలతో కాల్వలు అస్తవ్యస్థంగా మారడంతో పక్కనే పంటపొలాలు చెమ్మ పట్టి.. చవుడు భూములుగా మారుతున్నాయి. బాపట్ల జిల్లా అప్పికట్ల, భర్తిపూడి రైతులు పడుతున్న పాట్లు అన్నీఇన్నీ కావు.

బాపట్ల జిల్లా అప్పికట్ల, భర్తిపూడి, బాపట్ల ప్రాంతాల్లో మర్రిపూడి డ్రైన్ నిర్వహణను 2016 నుంచి అధికారులు గాలికి వదిలేశారు. గుర్రపుడెక్క, తూటుకాడ, పూడిక పేరుకుపోయాయి. పంట కాల్వలు అధ్వానంగా మారడంతో అన్నదాతలకు కష్టాలు తప్పడం లేదు. ఖరీఫ్, రబీ సీజనల్లో చివరి ఆయుకట్టు వరకు నీరందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. భారీవర్షాల సమయంలో పొలాల్లోనుంచి నీరు త్వరగా వెళ్లకపోవడంతో వరి ఓదెలు నీటిలో మునిగిపోయాయి. గత ఏడాది మే నెలాఖరున పనులకు టెండర్లు పిలిచారు. కాల్వల్లో పనులు జరగకముందే వర్షాలు కురిసి తూతూమంత్రంగా పనులు చేసి చేతులు దులిపేసుకున్నారు. ఈ ఏడాది ముందుగానే 20 కోట్ల రూపాయలతో 180 పనులు చేపట్టడానికి జలవనరుల శాఖ అధికారులు ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి పంపించారు. అనుమతి లభిస్తే ఏప్రిల్ నెలలో టెండర్లు పిలిచి మే నెలాఖరునాటికి పనులు చేయడానికి ప్రణాళిక రూపొందించారు. ఈసారైనా కాల్వలను బాగు చేసి సాగునీరు అందించాలని వేడుకుంటున్నారు.

' నాకు ఏడు ఎకరాల భూమి ఉంది. నాలుగు సంవత్సరాల నుంచి ఈ కాల్వలలో పూడిక తీయకుండా ఉండటం వల్ల మా పంట పొలాలకు నీరు రాకుండా పోతుంది. మేము నాలుగు సంవత్సరాలుగా అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ మురుగు డ్రైనేజి సమస్యలు పరిష్కరించాలి. 2016లో పూడికలు తీశారు. మళ్లీ ఇప్పటి వరకూ.. కాలువలలో పూడికలు తీయలేదు'-. ఇనుగంటి శ్రీనివాసరావు, రైతు, అప్పికట్ల

బాపట్ల జిల్లాలో 146 నీటిసంఘాలు, 72 డీసీలు, ఓ ప్రాజెక్టు ఉంది. గతంలో కాల్వల మరమ్మతులను కమిటీ సభ్యులే చూసుకునేవారు. స్వచ్చందంగా రైతులే కాల్వలు బాగు చూసుకుండేవారు. గత ఖరీఫ్ సీజన్ వరి వేసి నిండా మునిగారు. ఇప్పుడు మినుము వంటి పంటలు వేసినా నీటి చెమ్మతో పంట దెబ్బతింది. కాల్వల్లో నీరు ముందుకుపోయే మార్గం లేకనే ఈ పరిస్థితి తలెత్తిందని రైతులు వాపోతున్నారు.

'ఈ కాలువ దాదాపు 150 నుంచి 200 ఎకరాల వరకు విస్తరించి ఉంది. నీరు ఎదురు తన్నడం వల్ల పంటలు నష్టపోవాల్సి వస్తుంది. ప్రభుత్వాలు రైతే రాజు అంటున్నారు. రైతులు మాత్రం ఇబ్బుది పడుతుంటే చూస్తున్నారు. కౌలు చేసుకునే రైతులకు సైతం ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించి కాలువలలు బాగుచేస్తే సరిపోతుంది.'- అమర్నాథ్, రైతు, బాపట్ల

ఏది ఎమైనా కాల్వలను బాగుచేసి రైతులకు అప్పగిస్తే తప్ప రైతులు కోలుకునే అవకాశం లేదు. ప్రభుత్వం స్పందించాలని రైతులు కోరుతున్నారు. ఇప్పిటికైనా ప్రభుత్వం స్పందించి చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.

గుర్రపుడెక్క, తూటుకాడ, పూడిక తీయాలని కోరుతున్న రైతులు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details