అప్పుల బాధతో మరో కౌలు రైతు బలవన్మరణం చెందారు. బాపట్ల జిల్లా కారంచేడు మండలం స్వర్ణ గ్రామానికి చెందిన రైతు అమ్మిశెట్టి శ్రీనివాసరావు ఆత్మహత్య చేసుకున్నారు. భూమి లేని శ్రీనివాసరావు(50) ఏటా కౌలుకు తీసుకొని సాగు చేసేవారు. గత ఏడాది 10 ఎకరాల్లో మిర్చి, మరికొంత మాగాణి సాగు చేశారు. పంట దెబ్బతిని దిగుబడి తగ్గడంతో తీవ్రంగా నష్టపోయారు. రూ.20 లక్షలకు పైగా అప్పులు అయ్యాయి. వీటిని తీర్చేదారి లేక ఇంటి వద్ద పురుగుల మందు తాగడంతో స్థానికులు ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందారు. రైతు శ్రీనివాసరావుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
FARMER SUICIDE : అప్పుల బాధతో.. అన్నదాత ఆత్మహత్య - BAPATLA DISTRICT LATEST NEWS
Farmer Suicide: పంట పండించడం తప్ప మరో పని తెలియని రైతులపై అప్పుల రూపంలో కాలం కన్నెర్రజేస్తోంది. ఎన్నిసార్లు నష్టం వచ్చినా.. ఈసారైనా పంట రాకపోతుందా.. చేసిన అప్పులు తీర్చకపోతామా.. అని కోటి ఆశలతో ఎదురుచూస్తే.. మళ్లీ అదే నిరాశ మిగులుతోంది. అప్పుల భారం పెరిగిపోయి వాటిని తీర్చే మార్గం లేక.. చావుకు సిద్ధమవుతున్నారు. తాజాగా అప్పుల బాధతో బాపట్ల జిల్లాలో ఓ కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.
FARMER SUICIDE