Minister Meruga Nagarjuna: మంత్రి మేరుగ నాగార్జున వల్ల ప్రాణహాని ఉందని బాపట్ల జిల్లా అమర్తలూరు మండలం మూల్పురు మాజీ సర్పంచ్ భర్త మాణిక్యరావు ఆరోపించారు. బాపట్ల జిల్లా తెనాలిలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. తనపై అక్రమ కేసులు పెట్టేందుకు మంత్రి ప్రయత్నం చేస్తున్నారన్నారు. తాను చనిపోతే పూర్తి బాధ్యత మంత్రి మెరుగ నాగార్జునదేనని అన్నారు. బిల్లులు రాకుండా అడ్డుకుంటున్నారనీ వీడియో విడుదల చేసిన తరువాత తనపై కక్ష పెంచుకున్నారని.. ఇంటి చుట్టూ పోలీసులను పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవలే మంత్రిపై ఆరోపణల చేస్తూ మాణిక్యారావు వీడియో విడుదల చేశారు.
తన భార్య రోజ్ మేరీ సర్పంచ్‌గా ఉన్న సమయంలో గ్రామాభివృద్దికి సంబంధించిన బిల్లులు రాకుండా మంత్రి అడ్డుకుంటున్నారని వీడియోలో ఆరోపించారు. స్థానిక నాయకుల చేతిలో కీలుబొమ్మగా మారి మంత్రి దళితులను వేధిస్తున్నారని మండిపడ్డారు. మాణిక్యరావు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.