Edwin Released on Bail: మాదకద్రవ్యాల కేసులో ప్రధాన నిందితుడు ఎడ్విన్‌ను పోలీసులు అరెస్టుచేసి 10రోజులు గడవముందే బెయిల్‌పై విడుదల కావడం చర్చనీయాంశంగా మారింది. ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసు నమోదైతే నెలల తరబడి జైలుకే పరిమితం కావాల్సివస్తుంది. ఐతే అరెస్టయిన రోజుల వ్యవధిలో కేసులో కీలక నిందితుడు బెయిల్‌పై విడుదలకావడం కలకలం రేపుతోంది.
గోవా ప్రధాన కేంద్రంగా హైదరాబాద్‌కు కొకైన్, హెరాయిన్, ఎమ్డీఎమ్ఏ, ఎల్ఎస్డీ వంటి మాదకద్రవ్యాలు.. దిగుమతి అవుతున్నాయి. ఈ వ్యవహారంలో ఎడ్విన్ కీలకంగా వ్యవహరిస్తున్నాడు. యువతను మత్తుకు బానిసలుగా చేయకుండా కాపాడే ఉద్దేశంతో, హైదరాబాద్ పోలీసులు.. కీలకమైన ఆపరేషన్లు చేయడం ప్రారంభించారు. ఈ తరుణంలో ప్రత్యేకంగా నార్కోటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ పేరిట ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేశారు.
ఆ బృందాలు ఉస్మానియాయూనివర్శిటీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని తార్నాకాలో ప్రీతీష్ బోర్కర్ అనే గోవా డ్రగ్‌స్మగ్లర్‌ని పట్టుకోగా, మాదకద్రవ్యాల వ్యవహారం మొత్తం బయటపడింది. గోవాలో మత్తుదందా కొనసాగిస్తున్న, డిసౌజా అనే మరో డ్రగ్ స్మగ్లర్‌ను పోలీసులు పట్టుకున్నారు. అతడితో సంబంధాలు ఉన్న దాదాపు 600 మంది తెలుగు రాష్ట్రాల వినియోగదారులను గుర్తించి కేసులు నమోదుచేయడం ప్రారంభించారు.