Ravipudi Venkatadri passed away: భారత హేతువాద సంఘం చైర్మన్, హేతువాది మాసపత్రిక ఎడిటర్ రావిపూడి వెంకటాద్రి(101) మృతి చెందారు. అనారోగ్యంతో బాపట్ల జిల్లా చీరాలలో కన్నుమూశారు. వచ్చే నెల ఫిబ్రవరిలో 102వ పుట్టినరోజు వేడుకలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తుండగా ఇంతలోనే వెంకటాద్రి మృతి చెందారని కుటుంబ సభ్యులు తెలిపారు. హేతువాద మాస పత్రిక సంపాదకుడిగా ఎన్నో వ్యాసాలు రాశారు. వందలాది పుస్తకాలు ఆయన రచించారు. రావిపూడి వెంకటాద్రికి భార్య నాగరత్నం, ముగ్గురు సంతానం ఉన్నారు. వెంకటాద్రి స్వగ్రామం అయిన.. ఇంకొల్లు మండలం నాగండ్లలో ఆదివారం అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. వెంకటాద్రి మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలియచేశారు.
హేతువాది మాసపత్రిక ఎడిటర్ రావిపూడి వెంకటాద్రి కన్నుమూత - bapatla news
Ravipudi Venkatadri passed away: హేతువాది మాసపత్రిక ఎడిటర్, భారత హేతువాద సంఘం చైర్మన్ రావిపూడి వెంకటాద్రి (101) అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలు.. వెంకటాద్రి స్వగ్రామం ఇంకొల్లు మండలం నాగండ్లలో ఆదివారం జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.
హేతువాది మాసపత్రిక ఎడిటర్ రావిపూడి వెంకటాద్రి