Doctor Suspended In Bapatla Dist.: టెక్నాలజీని వాడుకుని ప్రతిరోజు హస్పిటల్లో హాజరవుతున్నట్లు నమ్మించాలని చూశాడు ఓ వైద్యుడు. బయోమెట్రిక్ హాజరు విధానం నుంచే తప్పించుకుని.. హాజరవుతున్నట్లు నమ్మించాలనుకున్నాడు. ఏకంగా అతని వేలిముద్రలతో కృత్రిమ వేలినే తయారు చేయించి హాస్పిటల్‌లోని సిబ్బందికి ఇచ్చాడు. వారు రోజు క్రమం తప్పకుండా హాజరు వేసేవారు. ఈ విషయం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి తెలియడంతో అతడిని వెంటనే విధుల నుంచి తొలగించారు.
బాపట్ల జిల్లా గుంటుపల్లి పీహెచ్సీలో భానుప్రకాశ్ విధులు నిర్వహిస్తున్నాడు. పీహెచ్సీలో విధులకు హాజరు కాకుండా ప్రైవేటు క్లినిక్ నడుపుతున్నాడు. విధులు నిర్వహించే చోట బయోమెట్రిక్ విధానంలో హాజరు నమోదు చేయాల్సి రావటంతో.. కృత్రిమ వేలు సృష్టించాడు. ఆస్పత్రిలోని సిబ్బంది ఆ కృత్రిమ వేలు ద్వారా హాజరు వేయిస్తుండేవాడు. జీతం ఇక్కడ తీసుకుంటూ.. విధులు మాత్రం తన క్లినిక్‌లో నిర్వహిస్తుండేవాడు. ఇదంతా గ్రామస్థుల గమనిస్తూ వచ్చారు.