ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మిగ్‌జాం తుపాన్ ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు-వేల ఎకరాల్లో నేలకొరిగిన వరి - ఏపీలో రైతుల సమస్యలు

Cyclone Michaung Live Updates in Andhra Pradesh: మిగ్‌జాం తుపాన్‌ రైతులను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఈదురు గాలుల దెబ్బకు వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. మరో 2 రోజులు వర్షాలు పడే అవకాశం ఉండటంతో, ఎంతో శ్రమించి కాపాడుకున్న పంట నీటిపాలు కానుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

Cyclone_Michaung_Live_Updates_in_Andhra_Pradesh
Cyclone_Michaung_Live_Updates_in_Andhra_Pradesh

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 5, 2023, 6:59 AM IST

Updated : Dec 5, 2023, 8:09 AM IST

మిగ్‌జాం తుపాన్ ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు-వేల ఎకరాల్లో నేలకొరిగిన వరి

Cyclone Michaung Live Updates in Andhra Pradesh :మిగ్‌జాం తుపాన్ ప్రభావంతో కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురు గాలుల దెబ్బకు వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. కోతకు వచ్చిన వరి నేలకొరిగింది. ఉద్యాన పంటలు నేలమట్టమయ్యాయి. మరో 2 రోజులు వర్షాలు పడే అవకాశం ఉండటంతో మినుము, మిరప పంట సైతం దెబ్బతినే ప్రమాదం ఉందని రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

Andhra Pradesh Farmers Crops Damage Due to Heavy Rains :మిగ్‌జాం తుపాన్‌ రైతులను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. తుపాన్ ప్రభావంతో ఉమ్మడి గుంటూరు జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో వేలాది ఎకరాల్లో వరిపంట నేలవాలింది. సాగర్ నుంచి సాగునీరు అందకున్నా రైతులు ఎంతో శ్రమించి కాపాడుకున్న పంట నీటిపాలు కానుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

దూసుకొస్తున్న మిగ్​జాం తుపాను- ఏపీలో పలుచోట్ల భారీ వర్షాలు

Heavy Rains in AP :ఇప్పటికే కొంతమంది రైతులు కోతలు కోసి ధాన్యాన్ని రోడ్లు, కల్లాల్లో ఆరబెట్టారు. వర్షం నుంచి ఈ ధాన్యాన్ని కాపాడుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరితో పాటు మిరప, మినుము పంటలు కూడా చేతికి వచ్చే పరిస్థితి లేదంటున్నారు. అప్పులు తెచ్చి, పెట్టుబడి పెట్టి, కంటికి రెప్పలా కాపాడుకున్న పంట తుపాను వల్ల కళ్ల ముందే నేలవాలి దెబ్బతింటుందని గగ్గోలు పెడుతున్నారు.

Cyclone Michaung Tracker :ఉత్తరాంధ్రలోనూ రైతులు తీవ్రంగా కలవరపడుతున్నారు. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఈదురు గాలులకు వరిపంట నేలవాలింది. కోసిన పంటను కాపాడుకునేందుకు అవస్థలు పడుతున్నారు. వాన కురుస్తుండటంతో కోతలు, నూర్పులు నిలిపివేశారు. వరి పనలను కుప్పలుగా పెట్టి కాపాడుకునే ప్రయత్నం చేశారు. పూసపాటిరేగ, డెంకాడ, భోగాపురం, వేపాడ, విజయనగరం, బొండపల్లి మండలాల్లో వరిపంట నేలవాలి రైతులు నష్టపోయారు. ధాన్యం కొనుగోళ్లలో దళారులు అందినకాడికి దోచుకుంటున్నారు. కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని మిల్లులకు తీసుకుపోగా, మిల్లర్లు కొర్రీలు వేస్తున్నారు. నిబంధనలు పక్కనపెట్టి ధాన్యం సేకరించాలంటూ అధికారులు మిల్లర్లను ఆదేశించారు.

రాష్ట్రంలో తుపాను - పలు జిల్లాల్లో విద్యా సంస్థలకు రేపు, ఎల్లుండి సెలవులు

Michaung Cyclone Live Map Location :ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లోనూ ఎడతెరిపి లేని వర్షాలతో, వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. కోనసీమలో చేతికొచ్చిన వరిపంట నేలకొరిగింది. ఆరబెట్టిన ధాన్యం రాశులు తడిసి ముద్దయ్యాయి. పట్టాలు కప్పినా అడుగు నుంచి నీరు చేరింది. కోనసీమలో సుమారు 62 వేల ఎకరాల్లో ఇంకా వరికోతలు కోయాల్సిఉంది. రామచంద్రపురం డివిజన్‌లో ఎడతెరిపిలేని వర్షానికి వరి పంట దెబ్బతింది. కాకినాడ డివిజన్ లోను కోతలు దాదాపుగా పూర్తవుతున్నా మిగిలిన పంట మాత్రం గాలులకు నేలకొరిగింది.

బీ అలర్ట్ - తీరం వైపు దూసుకొస్తున్న మిచౌంగ్ తుపాను - భారీగా కురుస్తున్న వర్షాలు

Last Updated : Dec 5, 2023, 8:09 AM IST

ABOUT THE AUTHOR

...view details