ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

CPS Issue సెప్టెంబర్ 1న చలో విజయవాడ నిర్వహించి తీరుతామంటున్న సీపీఎస్​ ఉద్యోగులు - ముఖ్యమంత్రి జగన్

September 1st ఎన్ని ఆటంకాలు ఎదురైనా సెప్టెంబర్ ఒకటవ తేదీన చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని సీపీఎస్​ ఉద్యోగుల సంఘం నేత గుర్రం మురళి స్పష్టం చేశారు. రాజస్థాన్, ఛత్తీస్​గఢ్ రాష్ట్రాలలో పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తున్నారని తెలిపారు. మన రాష్ట్రంలోనూ అదేవిధంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.

cps
cps

By

Published : Aug 29, 2022, 4:30 PM IST

CPS Employees Protest: ఎన్ని ఆటంకాలు వచ్చిన సెప్టెంబర్ ఒకటవ తేదీన చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని సీపీఎస్​ ఉద్యోగుల సంఘం నేత గుర్రం మురళి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే సీపీస్ రద్దు చేస్తామని ఇచ్చిన హామీని విస్మరించారన్నారు. ఇచ్చిన హామీని నెరవేర్చాలని శాంతియుత ప్రదర్శనకు పిలుపినిస్తే, అడ్డుకునే ప్రయత్నం చేయడం దారుణమన్నారు. ఇప్పటికే సీపీస్ రద్దుపై సంబంధిత మంత్రులతో చర్చలు జరిపిన ఎలాంటి స్పందన లేకపోవడం బాధాకరమన్నారు. రాజస్థాన్, ఛత్తీస్​గఢ్ రాష్ట్రాలలో పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తున్నారని తెలిపారు. అంధ్రప్రదేశ్​లో సైతం అదే విధంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీపీస్ విధానాన్ని రద్దు చేసి.. ఇచ్చిన హామీని నెరవేర్చే వరకు పోరాటం కొనసాగిస్తామని మురళి తెలిపారు.

APCPSEA సెప్టెంబర్ 1న చలో విజయవాడ నిర్వహిస్తాం

Police Notices: రద్దు చేసి పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలనే డిమాండ్​తో ఆందోళనకు సిద్ధమైన ఉద్యోగులను నిలువరించేందుకు పోలీసులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. చలో విజయవాడ, సీఎం నివాసం ముట్టడిలో పాల్గొనకుండా.. సీపీఎస్ ఉద్యోగ సంఘాల నేతలు, ఉద్యోగులకు వ్యక్తిగతంగా నోటీసులిస్తూ తహసీల్దార్ల ఎదుట బైండోవర్లు చేస్తున్నారు. అంతేకాకుండా ఉద్యోగులు పిలిస్తే కిరాయికి వెళ్లవద్దంటూ ప్రైవేటు వాహనదారులకు సూచిస్తున్నారు. విజయవాడ హోటళ్లలోనూ ముందస్తుగా సోదాలు నిర్వహిస్తున్నారు.

సెప్టెంబర్‌ 1న సీఎం ఇంటి ముట్టడి, విజయవాడలో భారీ బహిరంగ సభకు సీపీఎస్‌ సంఘాల పిలుపునిచ్చిన వేళ.. ఉద్యోగులపై పోలీసులు ఆంక్షల విధిస్తున్నారు. ఉద్యోగ సంఘాల నేతలకు, ఉద్యోగులకు పోలీసులు నోటీసీలు జారీ చేస్తున్నారు. పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్తున్న పోలీసులు.. అక్కడే ఉద్యోగులకు చలో విజయవాడ, సీఎం నివాసం ముట్టడి కార్యక్రమాలకు హాజరు కావొద్దంటూ నోటీసులు ఇస్తున్నారు. రెండు కార్యక్రమాలకు ప్రభుత్వం ఎలాంటి అనుమతి ఇవ్వలేదని.. అనుమతి లేకుండా హాజరుకావటం నేరపూరితమని.. నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నోటీసులను ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వివరిస్తున్నారు. ఏ కొండూరు మండలం సీపీఎస్ ఉద్యోగులు చలో విజయవాడ కార్యక్రమానికి హాజరుకాకూడదంటూ వారికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. 67 మంది సీపీఎస్ టీచర్లకు నోటీసులు అందుకున్నారు.

విజయవాడకు వెళ్లేందుకు బస్సులు, రైళ్లలో ఉద్యోగులు రిజర్వేషన్లు చేయించుకున్నారా అనే వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. మరో అడుగు ముందుకేసి ప్రైవేట్ వాహనాల్లోనూ తరలి వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఉద్యోగుల కోసం వెళితే చర్యలు తీసుకుంటామని ప్రైవేటు వాహనదారులకు నోటీసులు జారీ చేస్తున్నారు.ఉరవకొండలో మొత్తం 55 మందికి నోటీసులు అందించారు. ప్రభుత్వ చర్యలను ఉపాధ్యాయులు తప్పుబట్టారు.

విజయవాడలో ఏసీపీ రమణమూర్తి ఆధ్వర్యంలో గాంధీ నగర్ లో పోలీసులు లాడ్జిల్లో తనిఖీలు చేపట్టారు. ఉద్యోగ ఉపాధ్యాయులు ఎవరైనా నగరానికి వచ్చి లాడ్జిలలో బస చేస్తే చెప్పాలంటూ యజమానులకు సూచనలు చేశారు. ఉద్యోగులు తలపెట్టిన నిరసనకు అనుమతి లేదన్నారు.

ఉపాధ్యాయులు ఆందోళనలో పాల్గొనకుండా ఉండేందుకు వారంరోజులపాటు ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ షెడ్యూలు విడుదల చేసింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details