Centenary celebrations of Bandla Bapayya Educational Institutions: విద్య, వైద్యం అనేవి సేవ అని.. అవి వ్యాపారంగా మారితే విలువలు తగ్గిపోతాయని, డిగ్రీలకే ప్రాధాన్యత ఇవ్వడం వల్ల వినయ విధేయత, సంస్కారం అనేవి తగ్గిపోయాయని పూర్వ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. బాపట్ల జిల్లా వేటపాలెంలో బండ్ల బాపయ్య విద్యాసంస్థల శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన.. మహాత్మాగాంధీ, బాబూరాజేంద్రప్రసాద్, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, స్వాతంత్య్ర సమరంలో జైలుకెళ్లిన తొలిమహిళ అలివేలు మంగతాయారు, రావూసాహెబ్ బండ్ల బాపయ్య శెట్టి, గొల్లపూడి రాధాకృష్ణయ్య లాంటి మహనీయులు నడిచిన నేల వేటపాలెం అని, వారి పాద స్పర్శతో ఈ నేల పునీతమయిందని అన్నారు. ఈ విద్యాసంస్దల్లో చదువుకున్న అనేకమంది డాక్టర్లు, ఇంజినీర్లు, శాస్త్రవేత్తలతో పాటు ఇతర ఉన్నత కంపెనీల్లో ఉన్నతస్దితిలో ఉండటం సంతోషదాయకమన్నారు. ఎందరో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు విద్య అందించేందుకు వందేళ్ల నాడు విద్యాసంస్థలకు శ్రీకారం చుట్టిన మహోన్నత వ్యక్తి బాపయ్య శెట్టి అని లక్ష్మీనారాయణ కొనియాడారు. ఈ కార్యక్రమంలో పూర్వ అధ్యాపకులు, పూర్వ విద్యార్థులను సిబ్బందిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పోతుల సునీత పాల్గొన్నారు.
బాపట్లలో ఘనంగా బండ్ల బాపయ్య విద్యాసంస్థల శతాబ్ది ఉత్సవాలు - వేటపాలెంలో బండ్ల బాపయ్య విద్యాసంస్థలు
Bandla Bapayya Educational Institutions: విద్య, వైద్యం అనేవి సేవ అని.. అవి వ్యాపారంగా మారితే విలువలు తగ్గిపోతాయని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. బాపట్ల జిల్లా వేటపాలెంలో బండ్ల బాపయ్య విద్యాసంస్థల శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన.. ఎందరో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు విద్య అందించేందుకు వందేళ్ల నాడు విద్యాసంస్థలకు శ్రీకారం చుట్టిన మహోన్నత వ్యక్తి బాపయ్య శెట్టి అని లక్ష్మీనారాయణ కొనియాడారు.
Bandla Bapayya