బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం కుంచాలవారిపాలెం వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ కారు కాలువలోకి దూసుకెళ్లిన ఘటనలో ఓ మహిళ మృతి చెందింది. మరో ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి నిజాంపట్నం కాలువలోకి కారు దూసుకెళ్లింది. బాధితులు పిట్టలవానిపాలెం మండలం అల్కాపురం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కారును బయటకి తీసేందుకు చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
కాలువలోకి దూసుకెళ్లిన కారు..ఒకరు మృతి - కాలువలోకి దూసుకెళ్లిన కారు
ప్రమాదవశాత్తూ కారు కాలువలోకి దూసుకెళ్లి ఒకరు మృతి చెందిన ఘటన బాపట్ల జిల్లా కుంచాలవారిపాలెం వద్ద చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో కారులో నలుగురు ప్రయాణిస్తుండగా..ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు.
కాలువలోకి దూసుకెళ్లిన కారు