Boy Died Due To Electric Shock: బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం దైవాల రావూరులో ఆదివారం విషాదం చోటు చేసుకుంది. గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన ఇద్దరు చిన్నారులు సెలవురోజు కావటంతో బాదం కాయల కోసం సాయిబాబా గుడి ఎదురుగా ఉన్న బాదం చెట్టు ఎక్కారు. బాదం కాయలు కొస్తున్న సమయంలో చెట్టు పక్కనే ఉన్న 11కేవీ విద్యుత్ వైర్లు చెట్టును తాకడంతో.. చెట్టుపై ఉన్న ఒక బాలుడు విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మరో బాలుడు కరెంట్ షాక్తో కింద పడ్డాడు. మృతి చెందిన బాలుడు ఎస్సీ కాలనీకి చెందిన గడ్డం బుజ్జి కుమారుడు అఖిల్(13) గా గుర్తించారు. విద్యుదాఘాతంతో గాయపడిన మరో బాలుడు నూకతోటి సూబాబ్(12)ను చికిత్స నిమిత్తం మేదరమెట్లలోని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. అప్పటి వరకు కళ్లెదుట ఆడుతూ పాడుతూ కనిపించిన అఖిల్... కొన్ని క్షణాల్లోనే విగత జీవిగా మారడంతో ఆ గ్రామంలో విషాద చాయలు అలముకున్నాయి.
బాదం కాయలు కోసం చెట్టెక్కిన చిన్నారి.. విద్యుదఘాతంతో మృతి - ఏపీ క్రైం వార్తలు
Boy Died Due To Electric Shock: బాపట్ల జిల్లా కొరిశపాడులో విషాదం చోటు చేసుకుంది. అప్పటి వరకు అందరితో ఆటలు ఆడిన చిన్నారి.. బాదం కాయలు కోసం చెట్టెక్కి విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. సెలవు రోజున తోటి పిల్లలతో ఆడుకున్న బాలుడు కొన్ని క్షణాల్లోనే విగతజీవిగా మారడంతో.. గ్రామంలో విషాద చాయలు అలముకున్నాయి.
బాపట్లలో కరెంట్ షాక్ తగిలి బాలుడు మృతి
Last Updated : Jan 23, 2023, 8:48 AM IST