Bharat Biotech Inkovac as Booster Dose: కొవిడ్- 19 వ్యాధికి భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన చుక్కల మందు టీకా ‘ఇన్‌కొవాక్’ను బూస్టర్ డోసుగా వినియోగించేందుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) అత్యవసర అనుమతి ఇచ్చినట్లు తెలిసింది. దీన్ని ‘ఫైవ్ ఆర్మ్స్’ బూస్టర్ డోసుగా వ్యవహరిస్తారు. ప్రస్తుత అనుమతి ప్రకారం.. ఇప్పటికే రెండు డోసుల కొవాగ్జిన్ / కొవిషీల్డ్ టీకా తీసుకున్న వారు.. 6 నెలల తర్వాత బూస్టర్ డోసుగా ఈ చుక్కల మందు టీకా తీసుకోవచ్చు. ఈ టీకాను భారత్ బయోటెక్, యూఎస్‌లోని వాషింగ్టన్ వర్సిటీ- సెయింట్ లూయీస్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసింది. మన దేశంలో 18 ఏళ్ల వయసు దాటిన వారు ఈ టీకా వినియోగించేందుకు డీసీజీఐ అనుమతి ఇచ్చింది.
బూస్టర్ డోసుగా భారత్ బయోటెక్ చుక్కల మందు టీకాకు అనుమతి
Bharat Biotech Inkovac as Booster Dose: భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన చుక్కల మందు టీకా బూస్టర్ డోసుగా వినియోగానికి అనుమతి లభించింది. ‘ఇన్‌కొవాక్’ను బూస్టర్ డోసుగా వినియోగించేందుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) అత్యవసర అనుమతి ఇచ్చినట్లు తెలిసింది.
భారత్ బయోటెక్