ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆలివ్‌ రిడ్లే తాబేళ్ల సంరక్షణకు.. అటవీశాఖ అధికారులు చర్యలు - Olive Ridley turtles news

బాపట్ల జిల్లా సముద్ర తీర ప్రాంతం...అరుదైన తాబేళ్లకు ఆవాసంగా ప్రత్యేకత చాటుకుంటోంది. సంద్రంలోని జీవావరణానికి ఆయువుపట్టుగా నిలిచే ఆలివ్‌ రిడ్లే తాబేళ్లను సంరక్షించేందుకు.. జిల్లా అటవీశాఖ చర్యలు చేపట్టింది. అరుదైన తాబేళ్ల జాతిని వృద్ధి చేసేందుకు రెండు హేచరీలు ఏర్పాటు చేసి... సంతతిని కాపాడుతోంది.

ఆలివ్‌ రిడ్లే తాబేళ్లు
ఆలివ్‌ రిడ్లే తాబేళ్లు

By

Published : Apr 26, 2022, 5:44 AM IST

సముద్ర జీవులైన తాబేళ్లు పర్యావరణ పరిరక్షణలో కీలకపాత్ర పోషిస్తుంటాయి. మన దేశంలోనే ఐదు రకాల తాబేళ్లు మనుగడలో ఉండగా...మన రాష్ట్ర తీర ప్రాంతం ఆలివ్‌ రిడ్లే రకం తాబేళ్లకు ఆవాసంగా గుర్తింపు దక్కించుకుంది. రెండు అడుగుల పొడవు ఉండే ఈ ఉభయచరాలు దాదాపు 500 కేజీల బరువు ఉంటాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ నుంచి ఈ తాబేళ్లు.. సంతానోత్పత్తి కోసం వేల కిలోమీటర్లు ప్రయాణించి...మన తీరప్రాంతానికి వస్తుంటాయి. ఒక్కొక్కటి 90 నుంచి 160 వరకు గుడ్లు పెడతాయి. అక్రమ రవాణా చేసే దొంగలు, ఇతర జంతువుల వల్ల ఈ తాబేళ్ల గుడ్లకు ముప్పు ఉండటంతో.... అటవీశాఖ ప్రత్యేక సంరక్షణ చర్యలు చేపట్టింది. సూర్యలంక, నిజాంపట్నం వద్ద హేచరీలు ఏర్పాటు చేసింది.

ఆలివ్‌ రిడ్లే తాబేళ్ల సంరక్షణకు.. అటవీశాఖ అధికారులు చర్యలు

రాత్రి సమయాల్లో తీరానికి వచ్చే తాబేళ్లు.....ఇసుకలో గుడ్లు పెట్టి వెళ్లిపోతాయి. వాటి అడుగుల జాడల ప్రకారం సంరక్షకులు గుడ్లను గుర్తించి....వాటిని హేచరీకి తరలిస్తారు. అక్కడ ఇసుకలో వాటిని కప్పి పెడతారు. హేచరీలో ఉష్ణోగ్రత 28నుంచి 32 డిగ్రీల మధ్య ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. పొదిగించి పిల్లలు కాగానే వాటిని సముద్రంలోకి విడిచి పెడతారు. ఇక్కడ పుట్టిన తాబేళ్లు.. పదేళ్ల తర్వాత మళ్లీ ఇక్కడికే వచ్చి గుడ్లు పెట్టి సంతతిని పెంచుకుంటాయని సంరక్షకులు తెలిపారు.

ఏరోజు పుట్టిన తాబేలు పిల్లల్ని అదేరోజు సముద్రంలోకి విడిచిపెడతారు. పర్యావరణ సమతుల్యతను కాపాడే తాబేళ్ల జాతిని సంరక్షించే ప్రక్రియలో అటవీశాఖ అధికారులు, జంతు ప్రేమికుల్ని, విద్యార్థుల్ని భాగస్వాముల్ని చేస్తున్నారు.

ఇదీ చదవండి:ఆలివ్ రిడ్లే తాబేలు పిల్లలు సముద్రంలోకి విడుదల

ABOUT THE AUTHOR

...view details