ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Baby Shower to Cow: అద్దంకి వాసుల భక్తి... గోమాతకు సీమంతం - Gomatha Seemantham in Addanki

Gomatha Seemantham: హిందువులు గోవును ప్రత్యక్ష దైవంగా భావిస్తారు..పూజిస్తారు. గోమాతలోనే స‌క‌ల దేవ‌త‌లు కొలువై ఉంటార‌ని పురాణాలూ చెబుతాయి. అందుకే.. ఆవును పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు, సంపూర్ణ ఆరోగ్యం, సుఖ సంప‌ద‌లు ల‌భిస్తాయ‌ని నమ్ముతారు. అంతటి ప్రాశస్త్యమున్న గోవుకు సీమంతం చేసి గోభక్తి చాటుకున్నారు బాపట్ల జిల్లా అద్దంకి వాసులు. ఆ వేడుకలను మనమూ చూద్దాం రండి...

Baby Shower to Cow
Baby Shower to Cow

By

Published : Jun 3, 2022, 9:52 PM IST

అద్దంకి వాసుల గోభక్తి...గోమాతకు సీమంతం..

Baby Shower to Cow: మనిషి కూడా ప్రకృతిలో ఓ భాగమే అన్న విషయం మరచిపోతున్న రోజులివి. కాంక్రీటు అరణ్యాలు, యంత్రాల నడుమ అసలు ప్రకృతి ఉనికినే ప్రశ్నార్థకం చేస్తున్న కాలమిది. ఇలాంటి సమయంలో ప్రకృతిలోని జీవులతో మనిషికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తున్నారు కొందరు. భారతీయ సాంప్రదాయంలో ప్రత్యేక స్థానం ఉన్న గోవుల కోసం గోశాలలు నిర్వహిస్తున్నారు. అలాంటి ఓ గోశాల నిర్వాహకుడు గోనుగుంట సుబ్బారావు ఓ గోవుకు సీమంతం నిర్వహించి గోభక్తి చాటుకున్నారు.

బాపట్ల జిల్లా అద్దంకిలో జరిగిన ఈ గోమాత సీమంతం కార్యక్రమానికి మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. గోమాతకు పసుపు, కుంకుమలు రాసి.. కొత్త వస్త్రాలు సమర్పించుకున్నారు. గో ప్రదక్షిణలు చేశారు. వేద పండితుల సమక్షంలో ఈ గోమాత సీమంతం కార్యక్రమం వేడుకగా సాగింది.

కొన్ని సంవత్సరాలుగా గోవులను పరిరక్షిస్తూ గోశాల నిర్వహిస్తున్నానంటున్న గోనుగుంట సుబ్బారావు.. గోమాతకు సీమంతం నిర్వహించడం పూర్వ జన్మ సుకృతం అంటున్నారు.

"ఇంటి ఆడపడుచుకు ఏవిధంగా సీమంతం చేస్తామో...గోమాతకు అలాగే సీమంతం నిర్వహించాము. చుట్టు పక్కల గ్రామస్థులు, మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ వేడుకలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. 13ఏళ్లుగా గోశాలను నిర్వహిస్తున్నాం.మావద్ద 32 ఆవులు ఉన్నాయి. అందులో ఓ గోవు ఈనేందుకు సిద్ధంగా ఉంది. ఆ గోమాతకు ఇలా సీమంతం వేడుక నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది." -గోనుగుంట సుబ్బారావు, గోశాల నిర్వాహకుడు

అద్దంకి పట్టణంలో ఇలా గోవుకు సీమంతం నిర్వహించడం ఇదే తొలిసారి. ఈ కార్యక్రమంలో పాల్గొనడం తమకెంతో ఆనందాన్నిచ్చిందని స్థానిక భాజపా నేతలు, వాసవి క్లబ్ వనిత మహిళా సభ్యులు తెలిపారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details