ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆర్మీ జవాను ఆత్మహత్యతో ఉద్రిక్తత, అసలేం జరిగిందంటే

Army Soldier Commits Suicide ప్రేమించిన యువతే కేసు పెట్టడంతో మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్న జవాను మృతదేహంతో కుటుంబసభ్యులు ఆందోళన చేపట్టారు. కేసు పెట్టేందుకు కారణమైన యువతి తల్లిదండ్రులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ.. జవాన్ మృతదేహాంతో బంధువులు బాపట్ల జిల్లా చినగంజాం పోలీసుస్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. పెద్దఎత్తున గ్రామస్తులు రావడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.

ఆర్మీ జవాను ఆత్మహత్యతో ఉద్రిక్తత
ఆర్మీ జవాను ఆత్మహత్యతో ఉద్రిక్తత

By

Published : Aug 24, 2022, 4:21 PM IST

Updated : Aug 24, 2022, 9:34 PM IST

ఆర్మీ జవాను ఆత్మహత్యతో ఉద్రిక్తత

బాపట్ల జిల్లా చినగంజాం మండలం మూలగానివారిపాలెంకు చెందిన ఆర్మీ జవాన్‌ సూర్యప్రకాశ్‌ రెడ్డి జమ్మూలోని ఆర్మీ క్యాంపులో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సూర్యప్రకాశ్‌రెడ్డి బలవన్మరణానికి ప్రేమించిన యువతి కుటుంబ సభ్యులే కారణమంటూ జవాన్ మృతదేహంతో తల్లిదండ్రులు చినగంజాం పోలీసుస్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. తీవ్రంగా వేధించిన ఇంకొల్లు సీఐపై చర్యలు తీసుకోవాలని ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. అనంతరం వారు అక్కడి నుంచి మృతదేహంతో ఉరేగింపుగా తరలివెళ్లి 2 కిలోమీటర్ల దూరంలోని జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. దీంతో ఒంగోలు- చీరాల మధ్య ట్రాఫిక్‌ స్తంభించిపోయింది.

మూలగానివారిపాలెంకు చెందిన అక్కల సూర్యప్రకాశ్‌రెడ్డి, యువతి ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఏడాది క్రితం ఈ వ్యవహారం యువతి ఇంట్లో తెలియడంతో వేరే సంబంధాలు చూస్తున్నారు. నెలరోజుల క్రితం ఇరువురు ఇంట్లో నుంచి పారిపోగా.. యువతి తల్లిదండ్రులు ఫోన్‌ చేసి పెళ్లి చేస్తామంటూ నమ్మకంగా పిలిపించారు. ఇంటికి వచ్చిన అనంతరం తల్లిదండ్రులు బలవంతంగా ఆమెతో కేసు పెట్టించారని.. పోలీసులు సైతం తీవ్రంగా వేధించడం వల్లే తమ కుమారుడు చనిపోయాడని సూర్యప్రకాశ్‌రెడ్డి తల్లిదండ్రులు విలపించారు. ఈనెల 21న జమ్మూలోని ఆర్మీ క్యాంపులోనే సూర్యప్రకాశ్‌రెడ్డి ఉరివేసుకుని చనిపోగా.. మృతదేహం స్వగ్రామానికి చేరుకుంది. యువతి తల్లిదండ్రులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలపడంతో జాతీయ రహదారిపై సూర్యప్రకాశ్‌రెడ్డి బంధువులు ఆందోళన విరమించారు.

డీజీపీకి ఎమ్మెల్యే లేఖ: జవాన్ సూర్యప్రకాశ్‌రెడ్డి ఆత్మహత్యకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు.. డీజీపీ రాజేంద్రనాథ్​రెడ్డికి లేఖ రాశారు. పోలీసుల వేధింపులతోనే సూర్యప్రకాష్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారని.. ఎస్పీ స్థాయి అధికారితో కేసు విచారణ జరిపించాలని కోరారు. అవసరమైతే సీబీఐతో విచారణ జరిపించాలన్నారు. సీఐ రంగనాథ్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్​ చేశారు. నిజనిజాలు తెలియాలంటే సీఐ రంగనాథ్, జవాన్ సూర్యప్రకాశ్‌ కాల్‌డేటా పరిశీలించాలని సాంబశివరావు లేఖలో సూచించారు.

ఇవీ చూడండి

Last Updated : Aug 24, 2022, 9:34 PM IST

ABOUT THE AUTHOR

...view details