Car Burnt: మాములుగా అయితే ఎదైన పెద్ద వాహనం చిన్న వాహనాన్ని ఢీకొంటే ఆ ప్రమాదంలో నష్టపోయేది చిన్న వాహనమే. 'బట్ ఫర్ ఏ చేంజ్' ఇక్కడ మాత్రం బైకును ఢీ కొట్టిన అనంతరం మంటల్లో తగలబడిపోయింది ఓ స్కార్పియో వాహనం. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలు కాగా.. స్కార్పియోలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు.
బైక్‌ను ఢీకొని స్కార్పియో వాహనం దగ్ధం.. ఎక్కడంటే? - బాపట్ల వార్తలు
Scorpio vehicle got burnt after hitting a bike: ద్విచ్రకవాహనాన్ని ఢీకొని.. స్కార్పియో వాహనం మంటల్లో తగలబడిన ఘటన బాపట్ల జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్రగాయాలు కాగా.. క్షతగాత్రులను గుంటూరు జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కారులో ప్రయాణిస్తున్న వారు క్షేమంగా బయటపడ్డారు.
ద్విచక్రవాహనాన్ని, స్కార్పియో ఢీ కొట్టిన ప్రమాదంలో స్కార్పియో దగ్ధమైన ఘటన బాపట్ల జిల్లాలోని బాపట్ల-పొన్నూరు మధ్య ఈతేరు వద్ద చోటు చేసుకుంది. ఈతేరు గ్రామ సమీపంలో స్కార్పియో, ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో షార్ట్ సర్క్యూట్‌కు గురై కారులోంచి ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో ఆ వాహనం అక్కడికక్కడే దహనమైంది. ఈ ఘటనలో కారులో ఉన్నవారు సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదంలో ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులకు మాత్రం తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108 వాహనంలో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వాహనం నుంచి మంటలు ఎగసిపడుతూ.. కారు టైర్లు, డీజిల్ ట్యాంకు భారీ శబ్దంతో పేలిపోయాయి. ఆ సమయంలో పెద్ద పెద్ద శబ్దాలు రావడంతో అటుగా వెళ్లే వాహనదారులు భయబ్రాంతులకు గురయ్యారు.
ఇవీ చదవండి: