ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆకాశంలో ఎగరాల్సిన విమానం.. ఇలా ఇరుక్కుపోయిందేంటీ! - ap upadatye news

Airplane stuck under a bridge in bapatla: బాపట్ల జిల్లా అద్దంకి వాసులకు తెల్లవారు జామునే..సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే దృశ్యం కంటపడింది. ఓ అండర్ పాస్ బ్రిడ్జి కింద ఇరుక్కుపోయిన విమానం.. అటు ఇటు కదలాడుతూ, బయటకు వచ్చేందుకు ప్రయత్నించింది. దీంతో చేతిలో ఉన్న సెల్ ఫోన్లకు పనిచెప్పిన చూపరులు.. ఆ విమానం కదలికలను బందించారు. ఈ విమానం సంగతేంటీ.. ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్తుంది.. ఆవివరాలేంటో చూద్దాం.. !

బ్రిడ్జి కింద ఇరుక్కుపోయిన విమానం
బ్రిడ్జి కింద ఇరుక్కుపోయిన విమానం

By

Published : Nov 13, 2022, 11:30 AM IST

Updated : Nov 13, 2022, 1:18 PM IST

Airplane stuck under a bridge in bapatla: ఓ పాత విమానాన్ని కొచ్చిన్ నుంచి హైదరాబాద్​కు ట్రాలీ లారీపై తరలిస్తుండగా.. బాపట్ల జిల్లాలోని అండర్ పాస్ బ్రిడ్డ్​ కింద ఇరుక్కుపోయింది. స్థానికులు ఈ అంశాన్ని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేశారు. ఇప్పుడు వీడియో సోషల్​ మీడియాలో వైరల్​ అవుతోంది.

పాత విమానాన్ని హోటల్‌గా మార్చాలన్న ఉద్దేశంతో.. హైదరాబాద్‌కు చెందిన ‘పిస్తాహౌస్ సంస్థ’ దీనిని కొనుగోలు చేసింది. ఈ క్రమంలో దీనిని హైదరాబాద్ తరలిస్తుండగా గత రాత్రి బాపట్ల జిల్లా మేదరమెట్ల బైపాస్‌లోని.. అండర్ పాస్ వద్ద విమానాన్ని తరలిస్తున్న ట్రాలీ ఇరుక్కుపోయింది. దీంతో విమానానికి నష్టం వాటిల్లకుండా.. జాగ్రత్తగా దానిని అండర్ పాస్ నుంచి బయటకు తెచ్చే ప్రయత్నాలు చేశారు. విమానాన్ని తరలిస్తున్న డ్రైవర్​ రివర్స్​లో వాహనాన్ని అండర్ పాస్ దాటించారని స్థానికులు తెలిపారు.

బ్రిడ్జి కింద ఇరుక్కుపోయిన విమానం

ఇవీ చదవండి:

Last Updated : Nov 13, 2022, 1:18 PM IST

ABOUT THE AUTHOR

...view details