Road accident: బాపట్ల జిల్లా మార్టూరు మండలం బొల్లాపల్లి టోల్ ప్లాజా వద్ద 16వ నెంబర్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో నవదంపతులు మృతిచెందారు. రాత్రి 11 గంటల సమయంలో మార్టూరు వైపు నుంచి రామకూర్కు దంపతులు ద్విచక్రవాహనంపై వెళుతున్నారు. హైవే నుంచి పంగులూరు వెళ్లే మలుపు వద్ద వారి ద్విచక్ర వాహనాన్ని బెంగుళూరు వెళ్లే ప్రైవేట్ ట్రావెల్ బస్సు బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో జై పంగులూరు మండలం రామకూర్కు చెందిన నవ దంపతులు మిన్నకంటే పవన్ కుమార్, కృష్ణవేణి లకు తీవ్రగాయాలై అపస్మారక స్దితిలోకి వెళ్లారు. క్షతగాత్రులను హైవే అంబులెన్స్ ద్వారా ఒంగోలు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందారు.
రోడ్డు ప్రమాదంలో నవదంపతులు మృతి - 16వ నెంబరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం
Road accident: రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఉద్యోగులై నవదంపతులు మృతిచెందారు. ఈ ఘటన బాపట్ల జిల్లా మార్టూరు మండలం బొల్లాపల్లి టోల్ ప్లాజా వద్ద జరిగింది. పంగులూరు మండలం రామకూర్కు చెందిన నవ దంపతులు మిన్నకంటే పవన్ కుమార్, కృష్ణవేణిలు మృతి చెందడంతో గ్రామంలో విషాధచాయలు అలముకున్నాయి.
మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్టూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న మార్టూరు పోలీసులు బస్సు డ్రైవర్ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సాప్ట్ వేర్ ఉద్యోగులైన వారిద్దరు ఇంటివద్దనే ఉండి విధులు నిర్వహిస్తున్నారు. వీరిరువురికి జూన్ లో వివాహమైంది. శని, ఆదివారాలు సెలవు కావటంతో ఆదివారం 16వ నంబరు జాతీయ రహదారి పక్కన ఉన్న దాబాలో అల్పాహారం చేసేందుకు ద్విచక్ర వాహనంపై వెళ్లారు. అల్పాహారం ముగించుకొని స్వగ్రామానికి రామకూరు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. నవదంపతులు పవన్ కుమార్, కృష్ణవేణి లు మృతి చెందడంతో స్వగ్రామం రామకూర్లో విషాధచాయలు అలముకున్నాయి.
ఇవీ చదవండి: