Bull Race: సంక్రాంతి సంబరాలలో బాగంగా ఒంగోలుజాతి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు ఉత్సాహంగా జరుగుతున్నాయి.. బాపట్ల జిల్లా పర్చూరు మండలం, అన్నంబొట్లవారిపాలెంలో సంక్రాంతి సంబరాలలో బాగంగా గోరంట్ల రత్తయ్య చౌదరి మెమోరియల్ ప్రాంగణంలో ఎడ్ల బలప్రదర్శన పోటీలు అట్టహాసంగా జరుగుతున్నాయి. 35వ జాతీయస్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బలప్రదర్శన పోటీలు ఈనెల 19వ తేదీ వరకు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. ఈరోజు సేద్యపు విభాగంలో 16 జతల ఎడ్లు పోటీలో పాల్గొన్నాయి.
ఉత్సాహంగా సాగుతున్న ఎడ్ల బల ప్రదర్శన పోటీలు - బాపట్లలో ఎద్దుల పందెం
Bull Race: సంక్రాంతి ముగిసినా.. సంబరాలు ఇంకా పూర్తి కాలేదు. ఈ సంబరాల్లో భాగంగా బాపట్ల జిల్లా పర్చూరు మండలం, అన్నంబొట్లవారిపాలెంలో 35వ జాతీయస్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బలప్రదర్శన పోటీలు జోరుగా జరుగుతున్నాయి. పోటీలు ఈనెల 19వ తేదీ వరకు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. కాగా ఈ పోటీలు గోరంట్ల రత్తయ్య చౌదరి మెమోరియల్ ప్రాంగణంలో జరుగుతున్నాయి.

ఇరవై నిమిషాల కాలవ్యవధిలో పద్నాలుగు క్వింటాళ్ల బండను ఏ జత ఎక్కువ దూరం లాగితే ఆ జతను మొదటి విజేతగా ప్రకటిస్తారు, ఈ విభాగంలో మొత్తం ఎనిమిది బహుమతులు ఉంటాయి. మొదటి బహుమతి 45,116, రెండవ బహుమతి 35,116, మూడవ బహుమతి 25,116, నాల్గవ బహుమతి 20,116, ఐదవ బహుమతి 18,116, ఆరవ బహుమతి 15,116, ఏడవ బహుమతి 10,116, చివరి బహుమతి 5,116 గా నిర్ణయించినట్లు నిర్వాహకులు కొనకంచి సుబ్బారావు తెలిపారు. ఈ పోటీలను తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి సంక్రాంతి పండుగకు వచ్చిన ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు .
ఇవీ చదవండి: