31 people injured in Bapatla district: బాపట్ల జిల్లా అద్దంకి పట్టణ శివారులో కలవకూరు రోడ్డులోని ఇటుక బట్టీల వద్ద కూలీల ఆటో బోల్తా పడింది. ఈ ఘటన బుధవారం సాయంత్రం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అకస్మాత్తుగా వచ్చిన ద్విచక్ర వాహనాన్ని తప్పించే క్రమంలో ప్రమాద ఘటన చోటు చేసుకున్నట్లు తెలిపారు. ప్రమాద సమయంలో ఆటోలో సుమారు 34మంది మహిళలు, నలుగురు పురుషులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో 31మందికి గాయాలయ్యాయినట్లు స్థానికులు వెల్లడించారు. ఇద్దరికి తీవ్రగాయాలు కావటంతో ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
బైకిస్ట్ నిర్లక్ష్యం.. కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా.. కానీ - road accident in ap
31 people injured: ద్విచక్ర వాహనం నిర్లక్ష్యం కారణంగా కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాద ఘనటలో 31మందికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరికి తీవ్రగాయాలు కావటంతో ఒంగోలు రిమ్స్‌కి తరలించారు. ప్రమాద దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ టీవీలో రికార్డు అయ్యాయి.
కూలీల ఆటో బోల్తా
కూలీలు అందరూ బాపట్ల జిల్లా మార్టూరు మండలం ద్రోణాదుల గ్రామానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు. ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం పూరిమెట్ల గ్రామంలో మిరపకాయల కోతకు వెళ్లి తిరిగి ఇంటికి వెళుతుండగా అద్దంకి పట్టణ శివారులోని కలవకూరు రోడ్డులో ఇటుక బట్టీల వద్ద ప్రమాదం సంభవించింది. ప్రమాద దృశ్యాలు అక్కడే ఉన్నసీసీ టీవీలో రికార్డు అయ్యాయి.
ఇవీ చదవండి:
Last Updated : Feb 1, 2023, 10:48 PM IST