YCP Leaders Attacked ICDS: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులపై అధికార పార్టీ నేతల అగడాలు కొనసాగుతున్నాయి. తాజాగా అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటిలోని ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ యువరాజ్ సిబ్బంది వివేక్ లపై సోమవారం వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. పట్టణంలోని సాయిరాం వీధికి చెందిన ఓ అంగన్వాడి కేంద్రంలోని సహాయకురాలిని బదిలీ చేయాలని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి సిఫార్సు లేఖ తీసుకొని అక్కడి అంగన్వాడీ కార్యకర్త వైసీపీ నాయకులతో కలిసి పీడీ కార్యాలయానికి వెళ్లింది.
ఐసీడీఎస్ కార్యాలయ సిబ్బందిపై దాడికి పాల్పడిన వైసీపీ నేతలు - రాష్ట్రంలో రెచ్చిపోతున్న వైసీపీ నేతలు
YCP Leaders Attacked ICDS: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులపై అధికార పార్టీ నేతల అగడాలు కొనసాగుతున్నాయి. తాజాగా అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటిలోని ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ యువరాజ్ సిబ్బంది వివేక్ లపై సోమవారం వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారు.
అప్పటికే ఉద్యోగుల విధి నిర్వహణ సమయం ముగియడంతో అక్కడ ఉన్న సీనియర్ అసిస్టెంట్ యువరాజ్ ఆ పత్రాన్ని పట్టణంలోని ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో ఇవ్వాలని నేతలకు సూచించాడు. దాంతో ఎమ్మెల్యే చెప్పినా నీవు అడ్డు చెబుతావా అంటూ ఒక్కసారిగా రెచ్చిపోయారు. యువరాజు పై దాడి చేయడంతో పాటు అక్కడే ఉన్న సిబ్బంది వివేక్ మరి కొంతమందిని దుర్భాషలాడారని కార్యాలయ సిబ్బంది వాపోయారు. విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడికి చేరుకోవడంతో నేతలు అక్కడ నుంచి వెళ్లిపోయారు. జరిగిన విషయాన్ని తీవ్రంగా పరిగణించిన సిబ్బంది.. ఇలా దాడులకు గురువుతూ విధులు నిర్వహించలేమని సామూహికంగా సెలవుపై వెళ్లేందుకు నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు.
ఇవీ చదవండి