ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Volunteer Murdered a Woman's Husband in Peeleru: వాలంటీర్​ నిర్వాకం.. అడ్డుగా ఉన్నాడని అంతమొందించాడు

Volunteer Murdered a Woman's Husband in Peeleru : కొందరు వాలంటీర్లు తమకు అప్పగించిన బాధ్యతలను చేస్తుంటే.. మరికొందరు మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. అకృత్యాలకు, అరాచకాలు పాల్పడుతూ.. ప్రభుత్వం అప్పగించిన బాధ్యతలు చేస్తున్నామనే ముసుగులో మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. తమ సాన్నిహిత్యానికి అడ్డొస్తున్నాడని మహిళ భర్తను ఓ వాలంటీరు హత్య చేయించిన ఘటన అన్నమయ్య జిల్లా పీలేరులో చోటు చేసుకుంది. మరో ఘటనలో పాత గంజాయి కేసులో ముద్దాయిగా ఉన్న వాలంటీర్​ను పోలీసులు అరెస్టు చేశారు.

Volunteer_Murder_Woman_Husband_in_Pileru
Volunteer_Murder_Woman_Husband_in_Pileru

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 7, 2023, 3:01 PM IST

Volunteer Murdered a Woman's Husband in Peeleru :అన్నమయ్య జిల్లా పీలేరులో ఓ వ్యక్తిని వాలంటీర్​ హత్య చేయించాడు. ఆర్టీసీ నల్లగుట్ట ప్రాంతానికి చెందిన గ్రామ వాలంటీర్ కిషోర్ (32) ఇదే మండలం కాకులారంపల్లె ఇందిరమ్మ కాలనీకి చెందిన సుధాకర్ (35)ను అంతమొందించాడు. గత నెల 31వ తేదీన జరిగిన ఈ హత్యలో నిందితుడిగా ఉన్న కిషోర్​ను పీలేరు పోలీసులు అరెస్టు చేశారు. పీలేరు అర్బన్ సీఐ మోహన్ రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. పీలేరు మండలం కాకులారంపల్లె ఇందిరమ్మ కాలనీలో నివసిస్తున్న సుధాకర్​కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మూడున్నర ఏళ్ల కిందట ఉపాధి కోసం కువైట్​కి వెళ్లాడు. ఈ తరుణంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆయన భార్యపై వాలంటీర్ కన్నేశాడు. కాలనీ ఇల్లు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి లోబర్చుకుని వివాహేతర సంబంధం (Volunteer Extramarital Relationship) కొనసాగిస్తున్నాడు.

Volunteer Murdered a Woman's Husband in Peeleru: వాలంటీర్​ నిర్వాకం.. అడ్డుగా ఉన్నాడని అంతమొందించాడు

SudhakarMurder With Cyanide Needles:ఈ నేపథ్యంలో మూడు నెలల కిందట కువైట్ నుంచి ఆమె భర్త సుధాకర్ పీలేరుకి వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న అతను సదరు వాలంటీర్​పై పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేయగా.. వారు వాలంటీరును మందలించి పంపించారు. దీంతో తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న సుధాకర్​ను తొలగించుకోవాలని వాలంటీర్ కిషోర్ పథకం పన్నాడు. తిరుపతికి చెందిన ఉమా, చందు, సునీల్​తో కలిసి సుధాకర్ హత్యకు పథకంరచించాడు. వారి చేత సైనేడ్ సూదులు కొనుగోలు చేయించాడు.

Volunteer Withdraw Money From Woman Account: మహిళ ఖాతాలో నగదు మాయం.. ఏలూరు జిల్లాలో వాలంటీర్​ నిర్వాకం

ఆగస్టు 31వ తేదీన సుధాకర్ తన కుమార్తెను పీలేరు పట్టణంలోని ఓ పాఠశాల వద్ద దించడానికి ఆటోలో వెళ్లగా పథకం ప్రకారం ఆయన వద్దకు వచ్చిన వారు సైనేడ్ సూదితో గుచ్చి పరారయ్యారు. కాసేపటికి సుధాకర్ మృతి చెందాడు. తన భర్త హత్యలో వాలంటీర్ కిషోర్​పై అనుమానాలు ఉన్నాయని మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో వాలంటీర్ హస్తం ఉందని తేలడంతో కిషోర్​ను అరెస్టు చేయగా.. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. అయితే వాలంటీర్ కిషోర్​ను ఆగస్టు 28వ తేదీన విధుల నుంచి తొలగించామని అధికార వర్గాలు తెలిపాయి.

Volunteer Murdered Old Woman for Gold: విశాఖలో వాలంటీర్ ఘాతుకం.. బంగారం కోసం వృద్ధురాలి హత్య..
Volunteer Arrest in Ganja Case: గంజాయి కేసులో వాలంటీర్ అరెస్టు : పాత గంజాయి కేసులో ముద్దాయిగా ఉన్న వాలంటీర్​ను పోలీసులు (Volunteer Arrested in Ganja Case) అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలం చింతగరువులో 2018లో గంజాయి కేసులో వెంకటరావు అనే వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. బెయిల్​పై బయటకు వచ్చిన అతను 2019లో గ్రామ వాలంటీర్​గా చేరాడు. బెయిల్​పై ఉన్న నిందితుడు కోర్టుకు హాజరు కాకపోవడంతో.. కోర్టు ఆదేశాలు మేరకు పాడేరు పోలీసులు వెంకటరావుని అరెస్టు చేశారు. అనంతరం రిమాండ్​కు తరలించామని పోలీసులు తెలిపారు. గంజాయి కేసులో నిందితుడిగా ఉన్న అతన్ని గ్రామ వాలంటీర్​గా ఎలా నియమించారని పలువురు పశ్నించారు.

Volunteers Arrest in Illegal Liquor Sales: ఇద్దరు వాలంటీర్లు అరెస్ట్​: అన్నమయ్య జిల్లాలో మద్యం కేసులో ఇద్దరు వాలంటీర్లు అరెస్ట్ అయ్యారు. కురబలకోట మండలం అంగళ్లులో కర్ణాటక మద్యం అమ్ముతూ ఇద్దరు వాలంటీర్లు దొరికారు. దీంతో వారిద్దరిని పోలీసులు అరెస్ట్​ చేశారు. వీరిలో ఒకరు మహిళా వాలంటీర్​. వారి వద్ద నుంచి సెబ్​ పోలీసులు 480 కర్ణాటక మద్యం ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.

Volunteer Attacked on Boy వాలంటీర్​ ఘాతుకం.. సిగరెట్లు తీసుకురాలేదని బాలుడ్ని డాబాపై నుంచి తోశాడు!

ABOUT THE AUTHOR

...view details