ISRO student threatened by Telangana student: తెలంగాణలోని వరంగల్ ఎన్‌ఐటీలో చదువుతున్న అక్షయ్ అనే వ్యక్తి తనను బెదిరిస్తున్నారని అహ్మదాబాద్ ఇస్రో కేంద్రంలో ఇంటర్న్‌షిప్ చేస్తున్న సంగత్ నాయక్ ఆరోపించారు. పీయూశ్, మొహసీనా పేరుతో మెయిల్ చేసి బెదిరిస్తున్నట్లు బాధితుడు వెల్లడించారు. మెయిల్‌లో 10 కోట్ల రూపాయలు డిమాండ్ చేసినట్లు తెలిపాడు. 10 కోట్లు ఇవ్వకపోతే.. తన తల నరికేస్తానని బెదిరించినట్లు వాపోయారు.
ఇస్రోలో పనిచేస్తున్న వ్యక్తికి ఎన్‌ఐటీ స్టూడెంట్ బెదిరింపు.. రూ.10కోట్లు ఇవ్వాలంటూ.. - ఇస్రో విద్యార్థికి ఎన్‌ఐటీ స్టూడెంట్ బెదిరింపు
ISRO student threatened by Telangana student: ఇస్రోలో ఇంటర్న్‌షిప్ చేస్తున్న వ్యక్తిని తెలంగాణలో ఎన్‌ఐటీ విద్యార్థి బెదిరించాడు. 10 కోట్ల రూపాయాలు ఇవ్వాలంటూ... మెయిల్ చేశాడు. దీనితో ఆ వ్యక్తి పోలీసులను ఆశ్రయించారు.
ఇస్రో
ఈ విషయంపై సంగత్ నాయక్ అహ్మదాబాద్‌లోని శాటిలైట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సంగత్ నాయక్ చదువు కోసం కొద్ది రోజుల క్రితం తెలంగాణకు వచ్చాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే అక్షయ్ కూడా ఇంటర్న్‌షిప్ కోసం అప్లై చేయగా.. సంగత్ నాయక్ మాత్రమే వచ్చింది. దీనితో కక్ష పెంచుకున్న అక్షయ్.. ఇలా బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇవీ చూడండి: