Natusara: నాటు సారా తాగి ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు విచారణ చేపట్టారు. సోమవారం రాత్రి నీరుగట్టువారిపల్లిలో ఈ ఘటన జరిగింది. పెద్దమండెం మండలం వెలిగల్లుకు చెందిన రవి మగ్గం కార్మికుడిగా పనిచేస్తున్నాడు. మొలకలచెరువు మండలానికి చెందిన రమణ మదనపల్లిలో ఉంటూ మేస్త్రి పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. వీరిద్దరు సోమవారం రాత్రి నీరుగట్టువారిపల్లిలో నాటు సారా తాగిన కొంతసేపటికి మృతి చెందారు. ఈ సంఘటనపై జిల్లా ఎస్పీ హర్షవర్ధన రాజు మంగళవారం ఉదయం హుటాహుటిన మదనపల్లెకు వచ్చి నీరుగట్టువారి పల్లెలో విచారణ చేపట్టారు. స్థానికులతో మాట్లాడి సంఘటన ఎలా జరిగిందో అడిగి తెలుసుకున్నారు. స్థానికులు నాటు సారా ఎక్కువగా ఉందని అక్కడ ఉన్న ఆనవాళ్లను ఎస్పీకి చూపించారు. దీంతో ఎస్పీ స్థానిక అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. నాటు సారా విక్రయ దారులపై రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో 11 కేసులు ఉన్నట్లు పోలీసులు ఎస్పీకి తెలిపారు.
అన్నమయ్య జిల్లాలో నాటుసారా తాగి ఇద్దరు మృతి - క్రైం వార్తలు
Natusara: అన్నమయ్య జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. నాటుసారా తాగి ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు విచారణ చేపట్టారు.
నాటుసారా