TDP Activists Protest: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో నేడు జరగనున్న తెదేపా మినీ మహానాడు కార్యక్రమానికి నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 5 గంటలకు ప్రారంభం కానున్న మినీ మహానాడుకు తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు. వేదిక పరిసరాల్లో నాయకులు, కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలుకుతూ భారీ ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేశారు. కర్ణాటక రాష్ట్ర సరిహద్దు నుంచి రోడ్డు పొడవున మదనపల్లి పట్టణం బైపాస్ రోడ్డులో ఏర్పాటుచేసిన సభ వేదిక వరకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో పట్టణంలో భద్రతను పటిష్ఠం చేశారు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పర్యవేక్షణలో 400 మందికిపైగా పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు.
తెదేపా ఫ్లెక్సీలు తొలగింపు.. పార్టీ శ్రేణుల ఆందోళన - అన్నమయ్య జిల్లాలో తెదేపా మహానాడు
TDP Mini Mahanadu: రాయలసీమ జిల్లాల్లో నేటి నుంచి మూడు రోజుల పాటు తెదేపా అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు. ఇవాళ సాయంత్రం అన్నమయ్య జిల్లా మదనపల్లెలో మినీ మహానాడు నిర్వహించారు. కార్యక్రమానికి సంబంధించి నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండల కేంద్రంలో పోలీసులు తెదేపా బ్యానర్లను తొలగించడంతో కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
![తెదేపా ఫ్లెక్సీలు తొలగింపు.. పార్టీ శ్రేణుల ఆందోళన తెదేపా మినీ మహానాడుకు భారీ ఏర్పాట్లు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15750556-146-15750556-1657094385014.jpg)
తెదేపా మినీ మహానాడుకు భారీ ఏర్పాట్లు
బ్యానర్ల తొలగింపుతో నిరసన: చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండల కేంద్రంలో పోలీసులు తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించిన బ్యానర్లను తొలగించి, అధికార పార్టీ నేతల బ్యానర్లను ఉంచడాన్ని నిరసిస్తూ తెదేపా నేతలు మదనపల్లె-పలమనేరు రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారుల తీరుపై పెద్దపంజాణి మండల పార్టీ అధ్యక్షులు ఆనంద్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అధికారులు వైకాపా ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరించటం బాధాకరమన్నారు.
ఇవీ చూడండి
Last Updated : Jul 6, 2022, 2:01 PM IST