CHANDRABABU FIRES ON STATE GOVERNMENT : ఏం తప్పులు చేశారని తమ పార్టీ నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. అన్నమయ్య జిల్లా పీలేరు సబ్‌జైలులో ఉన్న పార్టీ కార్యకర్తలను ఆయన పరామర్శించారు. అక్రమ కేసులు పెట్టి తీవ్రంగా కొడతారా? అంటూ మండిపడ్డారు. తప్పు ఒప్పుకోవాలని ఒత్తిడి చేస్తారా? అని నిలదీశారు. తమ పార్టీ కార్యకర్తలపై సీఐ, ఎస్సై చాలా దారుణంగా వ్యవహరించారని ఆగ్రహించారు. ఎంతమందిని జైల్లో పెడతారో తాము చూస్తామన్నారు. భయపెట్టి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారని ఆరోపించారు. అక్రమ కేసులు పెడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
"ఏం తప్పు చేశారని మా పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టి వేధిస్తున్నారు. అక్రమ కేసులు పెట్టి తీవ్రంగా కొడతారా?. తప్పు ఒప్పుకోవాలని ఒత్తిడి చేస్తారా?. సీఐ, ఎస్సై చాలా దారుణంగా వ్యవహరించారు. భయపెట్టి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. నన్ను పీలేరు రాకుండా అడ్డుకుంటారా?. నేనెక్కడికి వస్తే అక్కడ పోలీసు యాక్టు 30 పెడతారా?. ఎంతమందిని జైల్లో పెడతారో మేమూ చూస్తాం. అక్రమ కేసులు పెడితే ఊరుకునేది లేదు. పోలీసులు ఇకనైనా పద్ధతి మార్చుకోండి. పెద్దిరెడ్డి పనైపోయింది.. బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు"-చంద్రబాబు
టీడీపీ ఫ్లెక్సీలు ఎందుకు చింపారని ప్రశ్నిస్తే కేసులా అని నిలదీశారు. తనని పీలేరు రాకుండా అడ్డుకుంటారా భయపెట్టి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు: చంద్రబాబు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఎక్కడికి వస్తే అక్కడ పోలీసు యాక్టు 30 పెడతారా అని ప్రశ్నించారు. పండగ జరుపుకోకుండా జైల్లో పెడతారా అని ప్రశ్నించిన చంద్రబాబు.. దీనికి మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు.