ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Son-in-law killed Aunt: అత్తను చంపిన అల్లుడు.. అసలేమైంది..! - అన్నమయ్య జిల్లా తాజా వార్తలు

Son in law killed his aunt: భార్యాభర్తల మధ్య నిత్యం గొడవలు జరుగుతుండేవి. అలాగే ఈరోజు కూడా వారిద్దరూ ఘర్షణ పడ్డారు. సర్ధిచెప్పేందుకు అత్త యత్నించింది. కోపంలో ఉన్న అల్లుడు రోకలిబండతో ఆమె తలపై బాదాడు. దీంతో ఆమె మృతి చెందింది. కుటుంబ కలహాలతోనే అత్తను అల్లుడు హత్య చేసినట్లు స్థానికులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Son in law killed his aunt
అత్తను చంపిన అల్లుడు

By

Published : May 20, 2022, 7:11 PM IST

Son in law killed his aunt: అత్తను అల్లుడు హత్య చేసిన ఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లిలో కలకలం సృష్టించింది. అత్త యశోదమ్మను అల్లుడు మహేష్ రోకలిబండతో బాది హతమార్చాడు. యశోద కూతురు బేబీకి ఇదివరకే వివాహమైంది. కానీ దంపతులు విడిపోయారు. దీంతో ఆమె మహేష్​ను రెండో వివాహం చేసుకుంది. వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని స్థానికులు తెలిపారు. శుక్రవారం కూడా మహేష్​, బేబీల మధ్య గొడవ జరుగుతుంటే.. యశోదమ్మ సర్ది చెప్పడానికి ప్రయత్నించింది. కోపోద్రిక్తుడైన మహేష్ రోకలిబండతో అత్తను బాదాడు. దీంతో ఆమె మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details