YCP leaders in Annamaiya district: అన్నమయ్య జిల్లా సుండుపల్లిలో ఓ దళిత మహిళ భూమిలో మామిడి చెట్లను ధ్వంసం చేసిన వైసీపీ నాయకులు ఇప్పుడు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. సుండుపల్లి మండలం దిన్నెపల్లి గ్రామానికి చెందిన దళిత మహిళ లక్ష్మీదేవి భూమిలో వంద మామిడి చెట్లను వైసీపీ నాయకులు రెండు వారాల కిందట ధ్వంసం చేశారు. భూమికి వేసిన కంచె కూడా తొలగించారు. దానిపై బాధితురాలు ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే సమీప బంధువులతో పాటు ఏడుగురుపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. ఆ ఘటనను కప్పిపుచ్చుకునేందుకు వైసీపీ నాయకులు సోమవారం దళిత మహిళలను పరామర్శించారు. ఎమ్మెల్యే మేడ మల్లికార్జున్రెడ్డి స్వయంగా అక్కడికి వెళ్లి దళిత మహిళ లక్ష్మీదేవికి ధైర్యం చెప్పి ఆమె పొలంలో తిరిగి మామిడి మొక్కలను నాటారు. జరిగిన ఘటనకు చింతిస్తున్నానని అండగా ఉంటానని వారికి భరోసా ఇచ్చారు.
చెట్లను ధ్వంసం చేసిన ఘటనలో.. ఎస్సీ, ఎస్టీ కేసుతో దిగివచ్చిన వైసీపీ నేతలు.. - దళిత మహిళ వార్త
SC, ST case against YCP MLA relatives: ఆ మహిళ తన భూమిలో మామిడి చెట్లను నాటుకుంది. అధికార పార్టీకి చెందిన నేతలు ఆమె భూమిలోకి అక్రమంగా చొరబడి మామిడి చెట్లును ధ్వంసం చేశారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే సమీప బంధువులతో పాటు ఏడుగురిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. చెట్లను ధ్వంసం చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో ఎమ్మెల్యే దిద్దుబాటు చర్యలకు దిగారు దళిత మహిళలను పరామర్శించారు.

ఎస్సీ ఎస్టీ కేసు
Last Updated : Dec 27, 2022, 12:19 PM IST