ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీఎం వస్తున్నారని రోడ్డువేశారు.. వారం రోజులకే కంకర తేలింది - ఏపీ తాజా వార్తలు

ROADS : ముఖ్యమంత్రి వస్తున్నారని వేసిన రోడ్డు కనీసం వారం రోజులైనా నిలవలేదు. కంకర తేలి.. అంతకు ముందున్న రోడ్డు కంటే భయానకంగా మారింది. దాదాపు 40 రోజులైనా ఆ రోడ్డును పట్టించుకునే దిక్కులేకుండా పోయింది. సీఎం పర్యటన అయిపోయిందిగా...అన్నట్లుగా అధికార్ల వ్యవహారం కనిపిస్తోందని, స్థానికులు ఆరోపిస్తున్నారు.

ROADS
ROADS

By

Published : Jan 5, 2023, 10:08 AM IST

ROADS : ముఖ్యమంత్రి పర్యటన అంటే బందోబస్తు, సౌకర్యాల ఏర్పాట్లు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన పర్యటన అంటే అధికారులకు ముందు గుర్తుకువచ్చేది భద్రత మరియు రహదారులు. భద్రతను భారీ పోలీసులతో పర్యవేక్షించే ఉన్నతాధికార్లు.. రోడ్ల సంగతిని మాత్రం వారం రోజుల ముందు చూస్తారు. గతేడాది నవంబర్ 30 న జగన్ అన్నమయ్య జిల్లా పర్యటను నేపధ్యంలో నవంబర్ 20 న ఆయన ప్రయాణించే మార్గంలో మదనపల్లె-పుంగనూరు రహదారిపై, పట్టణంలో గుంతలుగా ఉన్న దారులపై రోడ్లు, భవనాలశాఖ అధికారులు తారు వేసి మరమ్మతు చేశారు.. రోడ్డుపై ఉన్న గుంతలను పూడ్చారు. సీఎం పుణ్యమా అని రోడ్డు బాగుపడిందని .. స్థానికులు అనుకున్నారు. కాని నాసిరకంగా వేసిన రోడ్డు.. వారం రోజులకే కంకర తేలింది. గతంలో ఉన్న రోడ్డు కంటే భయకరంగా కంకర తేలడంతో..ప్రయాణికులు బెంబేలెత్తుతున్నారు. ఇప్పటికైన రోడ్డును మరోసారి మరమ్మత్తులు చేయాలని స్థానికిలు డిమాండ్ చేస్తున్నారు.

ముఖ్యమంత్రి జగన్​ పర్యటన సందర్భంగా అధికారులు మరమ్మత్తు చేసిన రోడ్డు

ABOUT THE AUTHOR

...view details