ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అన్నమయ్య జిల్లాలో ఐదుగురు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్​

Police seized red sandalwood: ఎర్రచందనం స్మగ్లర్లు రోజురోజుకు పెరుగుతున్నారు. తాజాగా అన్నమయ్య జిల్లాలో అక్రమంగా తరలించడానికి సిద్ధంగా ఉన్న ఎర్రచందనాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఐదుగురు స్మగ్లర్లు పట్టుపడ్డట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడి ఎర్రచందనం విలువ రూ. 10 లక్షలు ఉంటుందని తెలిపారు.

red sandal
red sandal

By

Published : Oct 31, 2022, 7:08 PM IST

Police seized red sandalwood: అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం వై. కోటలోని వేర్వేరు ప్రాంతాలలో దాడులు నిర్వహించినట్లు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. వై. కోటలోని గుండాలకోన వద్ద అక్రమ రవాణాకు సిద్ధం చేస్తున్న ఎర్రచందనాన్ని, ఐదుగురు స్మగ్లర్లను పట్టుకున్నామని అన్నారు. పట్టుబడిన వారి నుంచి రూ. 10 లక్షల విలువైన 32 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నామన్నారు. స్మగ్లర్లు జిల్లాలోని నందలూరు, ఓబులవారిపల్లి, పెనగలూరు మండలాలకు చెందిన సింగనమల రవి (49), నన్నూరు యానాదయ్య (44), వెంకటపతి (41) నాగిపోగు సుబ్రహ్మణ్యం (39), గోపుదారి రమేష్ (36)లను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. అరెస్టైన వెంకటపతిపై అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాలలో 19 ఎర్రచందనం కేసులు ఉన్నాయన్నారు.

పీడీ యాక్ట్ కేసులో అరెస్టై బెయిల్​పై వచ్చి మళ్లీ స్మగ్లింగ్​కు పాల్పడుతున్నట్లు తమ విచారణలో తేలిందన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడే వారిపై ఉక్కు పాదం మోపుతామని ఎస్పీ పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రాజకమల్ డీఎస్పీ శివ భాస్కర్ రెడ్డి, రైల్వే కోడూరు పోలీసులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details