Old Woman Raped in Drunkenness :నడవలేని స్థితిలో ఉన్న ఓ వృద్ధురాలు అనుమానాస్పద స్థితిలో మృతి (Suspect Death) చెందింది. ఓ వ్యక్తి మద్యం మత్తులో ఆమెపై అత్యాచారానికి (Rape) పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని మదనపల్లె మండలం కొత్తపల్లె పంచాయతీ ఈశ్వరమ్మకాలనీలో బుధవారం రాత్రి జరిగిన ఈ ఉదంతం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ప్రకాశం ఈశ్వరమ్మ కాలనీకి చెందిన వేణుగోపాల్ భార్య రెడ్డెమ్మ (58) మూడు సంవత్సరాలుగా నడవలేని స్థితిలో ఓ గదిలో నివాసం ఉంటోంది. ఆమెకు ఇద్దరు కుమారులు సుబ్రహ్మణ్యం, బాలాజీ ఉన్నారు. కుమారులిద్దరూ వేరుగా నివాసం ఉంటున్నారు. నడవలేని స్థితిలో ఉన్న రెడ్డెమ్మను కుటుంబ సభ్యులు ఈశ్వరమ్మ కాలనీ ప్రధాన రహదారిలోని ఓ ఇంటిని అద్దెకు తీసుకుని అందులో ఉంచి పోషిస్తున్నారు.
58 Years Lady Suspect Death in Annamayya District :ఈ నేపథ్యంలో రాత్రి 9.30 గంటల ప్రాంతంలో వేణుగోపాల్, ఇతని మనువడు హేమంత్ రెడ్డెమ్మకు భోజనం పెట్టేందుకు వచ్చారు. ఆ సమయంలో రెడ్డెమ్మ ఉంటున్న ఇంటి తలుపులు వేసి ఉండటంతో అనుమానం వచ్చి తలుపులు తట్టారు. తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చి తోయడంతో తెరుచుకున్నాయి. అప్పటికే రెడ్డెమ్మ మంచంపై నుంచి కింద పడి ఉండగా మంచంపై ఓ వ్యక్తి పడుకుని ఉండటాన్ని గుర్తించారు. కింద పడిన రెడ్డెమ్మను పరీక్షించగా ఆమె అప్పటికే చనిపోయి ఉండటంతో ఆ వ్యక్తే రెడ్డెమ్మను చంపేశాడని స్థానికులు సాయంతో పట్టుకుని చితక్కొట్టారు.