Kiran Kumar Reddy Visits Annamayya District: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్రెడ్డి అన్నమయ్య జిల్లాలోని తన సొంత నియోజకవర్గమైన పీలేరుకు వచ్చారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా హైదరాబాద్ నుంచి విమానంలో బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన కలికిరి కి చేరుకున్నారు. ముందుగా మార్గమధ్యలో ఉన్న వాల్మీకిపురం పట్టణంలో పర్యటించారు. ఇటీవల మృతి చెందిన తోటవీధికి చెందిన ఎస్.శివరాం, సత్యనారాయణ, కొత్తపేటవీధికి చెందిన సురేంద్ర రెడ్డి, బజారువీధికి చెందిన రెడ్డిరాణిల కుటుంబ సభ్యులను కిరణ్ కుమార్ రెడ్డి పరామర్శించి, సానుభూతి తెలిపారు. శివరాం భార్య శాంతమ్మ, సత్యనారాయణ భార్య రమాదేవి, సురేంద్ర భార్య ప్రభావతమ్మ, రెడ్డిరాణి భర్త కోసూరి చంద్రమౌలిని ఆత్మీయంగా పలకరించి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
అన్నమయ్య లో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పర్యటన... - Ex CM Nallari Kiran Kumar Reddy
Ex CM Nallari Kiran Kumar Reddy: ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన సొంత నియోజకవర్గమైన పీలేరుకు రెండు రోజుల పర్యటన నిమిత్తం వచ్చారు. హైదరాబాద్ నుంచి వచ్చిన ఆయన వాల్మీకిపురంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు అభిమానులు, నాయకులు ఆయనకు స్వాగతం పలికారు.
![అన్నమయ్య లో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పర్యటన... Kiran Kumar Reddy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-17096323-1035-17096323-1669992236068.jpg)
Nallari Kiran Kumar Reddy
అనంతరం కలికిరిలోని రోడ్లు భవనాల శాఖ అతిథి గృహానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పలువురు అభిమానులు, నాయకులు కిరణ్ కుమార్ రెడ్డికి స్వాగతం పలికారు. అనంతరం పీలేరు పట్టణంలో జరిగిన ఓ వివాహ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ సీఎం కిరణ్ వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా అభిమానులు, కార్యకర్తలను పేరుపేరునా పలకరించి వారి యోగక్షేమలను అడిగి తెలుసుకున్నారు.
ఇవీ చదవండి: