ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాయచోటి భూదందా కేసు.. ఏడుగురు వైసీపీ నేతలపై క్రిమినల్‌ కేసులు - రాయచోటి లో వైసీపీ నేతలు కబ్జాకు దిగారు

YCP Leaders Land Kabza : రాయచోటిలో వైసీపీ నాయకుల భూదందాపై అధికారులు చర్యలకు ఉపక్రమించారు. 120 కోట్ల విలువచేసే 13 ఎకరాల ప్రభుత్వ భూమి క్రయవిక్రయాలు చేసిన ఏడుగురిపై పోలీసులు క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు. వీరిలో ఆరుగురు ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి అనుచరులే. భూమిని రిజిస్ట్రేషన్‌ చేసిన కడప రూరల్‌ సబ్‌రిజిస్ట్రార్‌ శ్యామలాదేవిపైనా క్రిమినల్ కేసు నమోదైంది.

land kabza case
రాయచోటి భూదందా కేసు

By

Published : Dec 25, 2022, 10:44 PM IST

Updated : Dec 26, 2022, 6:41 AM IST

YCP Leaders Land Kabza : రాయచోటి పరిసర ప్రాంతాల్లోని ప్రభుత్వ భూమిని కాజేసేందుకు వైసీపీ ప్రజాప్రతినిధి కుట్రపై... ఈటీవీ-ఈనాడు కథనాలతో అధికారులు స్పందించారు. అక్రమార్కులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. రాయచోటి మాసాపేటలో సర్వే నంబర్‌ 971/1లోని 83 ఎకరాల ప్రభుత్వ భూమిలో 40 ఎకరాలను కలెక్టరేట్‌ సముదాయానికి, 30 ఎకరాలను వివిధ ప్రభుత్వ శాఖల భవనాలకు కేటాయించారు. మిగిలిన 13 ఎకరాలకు నకిలీ పత్రాలు సృష్టించి వైసీపీ నాయకులు అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు.

రాయచోటిలో కాకుండా కడప రూరల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో పెండింగ్‌ రిజిస్ట్రేషన్ కింద గత నెల 9న ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. రాయచోటి మాసాపేటకు చెందిన షేక్ హరూన్‌బీ, ఆమె కుమారుడు షేక్ ఖాదర్‌ బాషాల నుంచి.. లక్కిరెడ్డిపల్లె మండలం దిన్నెపాడుకు చెందిన వైసీపీ నాయకులు హరినాథ్‌రెడ్డి, జింకా రమేశ్‌, తాడిపత్రికి చెందిన గజేంద్రరెడ్డి, రాయచోటికి చెందిన యూసుఫ్‌ కొనుగోలు చేసినట్లు రిజిస్ట్రేషన్‌ జరిగింది. ఈ భూముల రిజిస్ట్రేషన్‌కు 30 లక్షల రూపాయల స్టాంప్‌ డ్యూటీ చెల్లించారు.

భూములపై ఎలాంటి పరిశీలన చేయకుండానే.. రాజకీయ ఒత్తిళ్లతో రిజిస్ట్రేషన్‌ చేసినట్లు కడప రూరల్ సబ్‌ రిజిస్ట్రార్‌ శ్యామలాదేవిపై ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ రిజిస్ట్రేషన్‌ చేశాక పరిశీలన కోసం ఈ నెల 21న రాయచోటి సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయానికి పంపినప్పుడు బండారం బయటపడింది. అవి ప్రభుత్వ భూములని తేలడంతో... సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గిరీశ అధికారులను ఆదేశించారు.

దొంగ రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న 13 ఎకరాలు ప్రభుత్వ భూమేనని.. రాయచోటి తహసీల్దార్‌ రవిశంకర్‌రెడ్డి స్పష్టంచేశారు. అక్రమ రిజిస్ట్రేషన్‌ చేసిన, చేసుకున్నవారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదుచేశారు. తహసీల్దార్‌ ఫిర్యాదు మేరకు రాయచోటి పోలీసులు ఏడుగురిపై క్రిమినల్‌ కేసులు పెట్టారు.

భూదందా వ్యవహారం బహిర్గతం కావడంతో వైసీపీ నాయకులు బుకాయిస్తున్నారు. 2018లోనే 98 లక్షలకు భూమి కొనుగోలుకు ఒప్పందం చేసుకున్నామని.. గత నెలలో రిజిస్ట్రేషన్‌ చేసుకున్నామని చెబుతున్నారు. ఈ వ్యవహారంలో వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి ప్రమేయమే లేదని సర్టిఫికెట్ ఇస్తున్నారు. Bite

కడప రూరల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ శ్యామలాదేవికి భారీగా ముడుపులు అందడం వల్లే అక్రమ రిజిస్ట్రేషన్‌ చేసినట్లు ప్రచారం సాగుతోంది. ఆమెపై క్రిమినల్‌ కేసు నమోదు కావడంతో... సస్పెండ్ చేయమంటూ ఉన్నతాధికారులు సిఫారసు చేసినట్లు తెలుస్తోంది.

ఇవీ చదవండి:

Last Updated : Dec 26, 2022, 6:41 AM IST

ABOUT THE AUTHOR

...view details