అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరులో జనసేన కార్యాలయం ప్రారంభించిన మనోహర్.. జిల్లాల పునర్వ్యవస్థీకరణ అసంబద్ధంగా ఉందన్నారు. రాయచోటి కేంద్రంగా జిల్లా ఏర్పాటుతో రైల్వేకోడూరు, రాజంపేటకు అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలు ఏర్పాటు పేరుతో రూ.600కోట్లు ఒక్క పులివెందులలోని ఖర్చు చేశారన్నారు. పవన్ కళ్యాణ్ ఆర్థిక మూలాలను దెబ్బకొట్టేందుకు సినిమా టికెట్లు రేట్లు తగ్గించి సినీ పరిశ్రమను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటివరకు 3వేల మంది కౌలు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిపారు.
Nadendla Manohar: 'మంత్రులపై సీఎంకు నమ్మకం లేదనడానికి రాజీనామాలు చేయించిన తీరే నిదర్శనం' - మంత్రుల రాజీనామా విషయంలో సీఎంపై నాదెండ్ల మనోహర్ ఫైర్
Nadendla Manohar: మూడేళ్లు పనిచేసిన మంత్రుల నుంచి ఖాళీ లెటర్‌హెడ్‌లపై.. సంతకాలు తీసుకోవటం ప్రజాస్వామ్యానికి విఘాతమని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. మంత్రులపైన కూడా ముఖ్యమంత్రికి నమ్మకం లేదనడానికి.. వారిని రాజీనామాలు చేయించిన తీరే నిదర్శనమని పేర్కొన్నారు.
![Nadendla Manohar: 'మంత్రులపై సీఎంకు నమ్మకం లేదనడానికి రాజీనామాలు చేయించిన తీరే నిదర్శనం' Nadendla Manohar comments on cm jagan over resigns of ministers](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14986048-1045-14986048-1649652686768.jpg)
మంత్రుల రాజీనామా విషయంలో సీఎంపై నాదెండ్ల మనోహర్ ఫైర్
మంత్రుల రాజీనామా విషయంలో సీఎంపై నాదెండ్ల మనోహర్ విమర్శలు