road accident in annamayya district : అన్నమయ్య జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదాలలో నలుగురు వ్యక్తులు మరణించారు. అందులో ఇద్దరు చిన్నారులు ఉండటం అందరినీ కలచివేస్తోంది. గుర్రంకొండ మండలం చెర్లోపల్లి పంచాయతీకి చెందిన సతీష్ కుమార్ రెడ్డి, అతని స్నేహితుడు హేమంత్ ద్విచక్రవాహనంపై మదనపల్లెకి వచ్చిన వీరు.. ఎంఎల్ఎల్ ఆస్పత్రి ఎదుట ఆటోను తప్పించబోయి ప్రమాదవశాత్తు కింద పడ్డారు. ఈ ఘటనలో సతీష్ కుమార్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా.. హేమంత్‌కు తీవ్రగాయాలయ్యాయి.
Accident: వేర్వేరుచోట్ల రోడ్డు ప్రమాదాలు.. నలుగురు మృతి - ఏపీ వార్తలు
road accident in annamayya district : అన్నమయ్య జిల్లాలో సోమవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. మృతులలో ఇద్దరు చిన్నారులున్నారు. ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
కురబలకోట మండలం మునుగోడు సమీపంలోని జరిగిన మరో ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ద్విచక్రవాహనాన్ని లారీ ఢీ కొట్టిన ఘటనలో ముగ్గురు కుటుంబ సభ్యులు మృతి చెందారు. మృతులు తంబళ్లపల్లి మండలం ఎద్దుల వారిపల్లికి చెందిన ఖాదర్ భాషా, జునోద్(7), జోయా(10) గా గుర్తించారు. గాయపడిన హాబీరను మదనపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి:LORRY: ఉరవకొండ శివారులో కంటైనర్ బీభత్సం.. తప్పిన పెను ప్రమాదం