Food Poison: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని ఓ బిర్యాని హోటల్లో కలుషిత ఆహారం తిని 17 మంది అస్వస్థతకు గురయ్యారు. నిన్న రాత్రి హోటల్లో మండి చికెన్, మటన్ బిర్యాని తినడంతో వాంతులు, విరేచనాలతో స్థానిక వైద్య విధాన పరిషత్ ప్రాంతీయ ఆసుపత్రిలో బాధితులను చేర్పించి.. చికిత్స అందిస్తున్నారు. బాధితుల్లో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండడంతో కుటుంబీకులు హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కలుషిత ఆహారం తిన్న బాధితుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు.
జహీరాబాద్లో కలుషిత ఆహారం తిని 17 మందికి అస్వస్థత.. అసలు ఏం జరిగింది? - AP Lateast news
Food Poison: ఓ బిర్యాని హోటల్లో కలుషిత ఆహారం తిని 17 మంది అస్వస్థతకు గురయ్యారు. నిన్న రాత్రి హోటల్లో మండి చికెన్, మటన్ బిర్యాని తినడంతో వాంతులు, విరేచనాలతో స్థానిక వైద్య విధాన పరిషత్ ప్రాంతీయ ఆసుపత్రిలో బాధితులను చేర్పించి.. చికిత్స అందిస్తున్నారు. బాధితుల్లో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండడంతో కుటుంబీకులు హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కలుషిత ఆహారం తిన్న బాధితుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు.
Food Poison
ఈ ఘటన విషయం తెలియడంతో జహీరాబాద్ పట్టణ పోలీసులు ఆసుపత్రికి చేరుకుని.. బాధితుల నుంచి వివరాలు సేకరించారు. హోటల్ నిర్వాహకులు కలుషిత ఆహారం ఇవ్వడంతోనే వాంతులు, విరోచనాలు అయి అస్వస్థతకు కారణం అయ్యాయని బాధితుల కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రిలో వైద్యం పొందుతున్న బాధితుల పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శేషురావు తెలిపారు.
ఇవీ చదవండి: