ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కాపలాకు వెళ్లిన రైతు తిరిగిరాని లోకాలకు.. కుక్కల దాడిలో మృతి.. - అన్నమయ్య జిల్లాలో కుక్కల దాడిలో రైతు మృతి చెందాడు

Farmer Killed In Dog Attack: వీధి కుక్కలు తెలుగు రాష్ట్రాల్లో స్వైర విహారం చేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా గల్లీలో చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వరకూ ఎవ్వరిని వదలకుండా కరుస్తున్నాయి. తాజాగా అన్నమయ్య జిల్లాలో కుక్క కాటుకు ఓ రైతు బలయ్యాడు.

Etv Bharat
Etv Bharat

By

Published : Apr 4, 2023, 6:52 PM IST

Farmer Killed In Dog Attack : తెలుగు రాష్ట్రాల్లో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. కుక్క కాటుకు గురయ్యే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల కుక్కల దాడిలో వందల సంఖ్యలో ప్రజలు గాయాల పాలయ్యారు. అంతటితో ఆగకుండా ప్రాణాలను సైతం తీస్తున్నాయి. పిక్కలు కనిపించడమే తరువాయి అన్నట్లుగా ప్రజలపై దాడులకు దిగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఓ బాలుడు వీధి కుక్కల కాటుకు ప్రాణాలు వదిలాడు. తాజాగా మన రాష్ట్రంలో ఓ రైతు ప్రాణాలు తీశాయి వీధి కుక్కలు.

కాపలాకు వెళ్లిన రైతు తిరిగి రాని లోకాలకు :అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం ముదినేని వడ్డేపల్లిలో దారుణం చోటు చేసుకుంది. రాత్రి కాపలకు వెళ్లిన ఓ రైతుపై కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో రైతు తీవ్రంగా గాయపడడంతో ఆయన అక్కడికక్కడ ప్రాణాలు వదిలాడు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. ముదినేనివడ్డేపల్లికి చెందిన ఎం రెడ్డయ్య (55) అనే రైతు సోమవారం రాత్రి పొలం వద్దకు కాపలా వెళ్లి ఉదయం ఇంటికి తిరిగి రాలేదు. ఆయన కోసం కుటుంబ సభ్యులు గాలించగా పొలానికి సమీపంలోని గుట్ట వద్ద బండ రాతిపై ఆయన మృతదేహం కనిపించింది.

రెడ్డియ్య గొంతు భాగం తల శరీర భాగాలపై కుక్కకాట్లతో తీవ్ర రక్తం, గాయాలు ఉండడంతో కుక్కలు దాడి చేయడంతోనే తన తండ్రి మృతి చెందాడని రెడ్డయ్య కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే సంఘటన స్థలాన్ని రాయచోటి గ్రామీణ సీఐ లింగప్ప సిబ్బందితో కలిసి వెళ్లి పరిశీలించారు. కుక్కల దాడి ఘటనపై విచారణ సాగిస్తున్నామని పరీక్ష నిమిత్తం మృతదేహాన్ని రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రి తరలించి కేసు నమోదు చేశామని సీఐ పేర్కొన్నారు.

అదనపు కలెక్టర్‌పై వీధీ కుక్కు దాడి : తెలంగాణ రాష్ట్రం సిద్ధిపేట జిల్లా అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్ రెడ్డిపై వీధి కుక్క దాడికి దిగింది . కుక్క దాడిలో గాయపడ్డ అదనపు కలెక్టర్‌ను అధికారులు ఆసుపత్రికి తరలించారు. రెండు రోజుల క్రితం తన పెంపుడు కుక్కతో క్వార్టర్స్‌లో ఉన్న గార్డెన్‌లో శ్రీనివాస్ రెడ్డి వాకింగ్ చేస్తున్నప్పుడు ఓ వీధి కుక్క అటు వైపునకు వచ్చి ఆయన్ను కరిచింది. అడ్డుకోబోయిన శ్రీనివాస్ రెడ్డి పెంపుడు కుక్కపై కూడా దాడికి దిగింది. ప్రస్తుతం అదనపు కలెక్టర్‌ సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని అధికారులు తెలిపారు. మరో వైపు కలెక్టరేట్ సమీపంలోనే మరో ఇద్దరిపై కుక్కలు దాడి చేసినట్లు అధికారులు తెలిపారు. కుక్కల దాడులతో క్వార్టర్స్‌లో ఉన్న అధికారుల కుటుంబ సభ్యులు భయాందోళనకు లోనవుతున్నారు.

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details