Conflict: అన్నమయ్య జిల్లా రాజంపేట బలిజపల్లి జాతర నిర్వహణలో విషయంలో నిర్వాహకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. గంగమ్మ అమ్మవారికి ఈనెల 21న జాతరను నిర్వహించి, పోతును పట్టాలని నిర్ణయించారు. పోతుకి దండ వేసే విషయంలో... ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వాగ్వాదం శృతి మించి తోపులాటకు దారి తీసింది. పట్టణ పోలీసులు చొరవ చూపి.. ఇరువర్గాలను చెదరగొట్టారు. దీంతో గంగమ్మ జాతర మరోసారి వాయిదా పడినట్లయింది. ఇప్పటికే గత రెండు నెలలుగా జాతర నిర్వహణ విషయంపై.. ఇరువర్గాల మధ్య చర్చలు జరిగాయి. సయోధ్య కుదరకపోవడంతో ఎప్పుడో నిర్వహించాల్సిన జాతర వాయిదాపడుతూ వస్తోంది. చివరకు జాతర నిర్మించాలని భావించిన నిర్వాహకులు కేవలం దండ వేసే విషయంలో ఘర్షణకు దిగి జాతరను నిలిపివేయడంపై భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Conflict: ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. మళ్లీ జాతర వాయిదా..!
Conflict: గంగమ్మ జాతర నిర్వహణ విషయంలో నిర్వాహకుల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న ఘటన అన్నమయ్య జిల్లా రాజంపేట బలిజపల్లి జరిగింది. కేవలం పోతుకి దండ వేసే విషయంలో... ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో గంగమ్మ జాతర మరోసారి వాయిదా పడినట్లయింది.
జాతర నిర్వహణపై ఇరు వర్గాల మధ్య ఘర్షణ