ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి' కార్యక్రమాన్ని అడ్డుకున్న వైసీపీ.. ఇరు పార్టీల వాగ్వాదం - తంబళ్లపల్లె నియోజకవర్గం ఇన్‌ఛార్జి శంకర్‌

Clash between TDP YCP: అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో ఇదేమి ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమాన్ని అడ్డుకున్న వైకాపా శ్రేణులు తంబళ్లపల్లి మండలం కోటకొండలో ఇరు పార్టీల నాయకుల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని నిర్వహించడానికి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే తంబళ్లపల్లె నియోజకవర్గం టీడీపీ ఇన్​ఛార్జ్ జీ శంకర్​ను వైసీపీ నాయకులు కార్యకర్తలు అడ్డుకున్నారు. అయితే శంకర్ కార్యక్రమాన్ని నిర్వహించాలని పట్టుబట్టడంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

Clash between TDP YCP
టీడీపీ వైసీపీల మధ్య ఘర్షణ

By

Published : Dec 22, 2022, 10:32 PM IST

Clash between TDP YCP: టీడీపీ మాజీ ఎమ్మెల్యే జి. శంకర్ 'ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి' కార్యక్రమం నిర్వహించడానికి తంబళ్లపల్లి మండలంలోని కోటకొండ గ్రామానికి వచ్చారు. అయితే స్థానిక వైసీపీ నాయకులు శంకర్​ గ్రామంలోకి రాకుండా అడ్డుకున్నారు. అంతేకాకుండా కొంతమంది నల్ల దుస్తులు, బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. సమాచారం తెలుసుకున్న మదనపల్లె డీఎస్పీ కేసప్ప కోటకొండకు బయలుదేరి మాజీ ఎమ్మెల్యే శంకర్​కు నచ్చజెప్పే ప్రయత్నం చేయగా ఆయన ఒప్పుకోలేదు. ఎట్టి పరిస్థితుల్లో గ్రామంలోకి వెళ్లి.. తిరిగి వచ్చేస్తానని చెప్పగా పోలీసులు అందుకు అంగీకరించలేదు. చివరకు పోలీసులు శంకర్​కు నచ్చజెప్పి వెనక్కి పంపారు.

టీడీపీ వైసీపీల మధ్య ఘర్షణ

ABOUT THE AUTHOR

...view details