ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

CBN TOUR: 'ఓట్ల బాధ్యత మీది.. మీ భవిష్యత్​కు భరోసా నాది' - చంద్రబాబు తాజా వార్తలు

CBN REVIEW MEETING: నాయకులంతా ఏకతాటిపై పని చేయాలని.. విభేదాలతో పార్టీకి నష్టం వాటిల్లేలా వ్యవహరిస్తే సహించేదిలేదని.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు శ్రేణులను హెచ్చరించారు. కడప, రాజంపేట లోక్‌సభ అభ్యర్థులుగా శ్రీనివాసుల రెడ్డి, గంటా నరహరిని ప్రకటించిన ఆయన.. కార్యకర్తలు వారికి సహకరించాలని ఆదేశించారు.

CBN TOUR
ఓట్ల బాధ్యత మీది.. మీ భవిష్యత్​కు భరోసా నాది

By

Published : Jul 8, 2022, 12:05 PM IST

ఓట్ల బాధ్యత మీది.. మీ భవిష్యత్​కు భరోసా నాది

CBN REVIEW MEETING: రాయచోటి లోక్​సభ పరిధిలోని 7 శాసనసభ నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో.. తెలుగుదేశం అధినేత సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తంబళ్లపల్లె నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ శంకర్ యాదవ్​కు వ్యతిరేకంగా.. కొందరు నినాదాలు చేశారు. పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గ సమీక్షలో ఇరు వర్గాల మధ్య.. ఆధిపత్య పోరు రచ్చకెక్కింది. సభావేదికపై ఒక వర్గాన్ని మరొక వర్గం అడ్డుకుంది. బోయకొండ గంగమ్మ ఆలయ మాజీ ఛైర్మన్ రమణా రెడ్డిని వేదికపైకి వెళ్లకుండా.. పుంగనూరు ఇన్‌ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి అనుచరులు అడ్డుకున్నారు. ఇరువర్గాలు పరస్పరం వాగ్వాదానికి దిగారు. కార్యకర్తల బాహాబాహీపై.. చంద్రబాబు ఘాటుగా స్పందించారు. ఆయా నియోజకవర్గాల్లో.. పార్టీ నాయకత్వ నిర్ణయానికి అనుగుణంగా కార్యకర్తలు పనిచేయాలని ఆదేశించారు.

కడప లోక్‌సభ అభ్యర్థిగా శ్రీనివాసుల రెడ్డి, రాజంపేట లోక్‌సభ అభ్యర్థిగా గంటా నరహరి పోటీ చేస్తారని చంద్రబాబు ప్రకటించారు. అధినేత ఆదేశానుసారం పార్టీ విజయానికి కృషి చేస్తామని నేతలు అన్నారు. సమీక్షల అనంతరం కలికిరి నుంచి..రోడ్డు మార్గాన రేణిగుంటకు చేరుకున్న చంద్రబాబు రాత్రి అక్కడే బస చేశారు. నేడు నగరి, గంగాధర నెల్లూరు నియోజకవర్గాల పరిధిలోని కార్వేటిలో బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొంటారు. చంద్రబాబు పర్యటనను అడ్డుకునేందుకు పోలీసులు 30 యాక్ట్ అమలు చేశారంటూ.. నేతలు ఆరోపించారు.

ఇవీ చదవండి:

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details