Dispute Between Two Groups: అన్నమయ్య జిల్లా రాజంపేటలో ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి, జడ్పీ ఛైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. జడ్పీ ఛైర్మన్ వర్గీయులు ఏకంగా ఎమ్మెల్యే మేడా పైనే ఎదురు తిరిగి వాగ్వాదానికి దిగారు. బుధవారం రాజంపేటలో జగనన్న స్మార్ట్ టౌన్షిప్ లోగో ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. సభ ముగిసిన అనంతరం తిరిగి వెళ్ళిపోతున్న అన్నమయ్య అర్బన్ డెవలప్మెంట్ ఛైర్మన్ గురువు మోహన్‌ను జడ్పీ ఛైర్మన్ వర్గీయులు అడ్డగించి ప్రశ్నించారు. జడ్పీటీసీగా ఉన్న తన భార్యను సమావేశానికి ఎందుకు పిలవలేదని ఓ వ్యక్తి తీవ్రంగా మండిపడ్డారు. దళితులమనే భావనతోనే తమను సమావేశానికి ఆహ్వానించలేదా అని ఆయన ప్రశ్నించారు. పార్టీలో ఉన్నా ఎలాంటి విలువ ఇవ్వడం లేదని.. కనీసం ప్రోటోకాల్ పాటించలేదని మరో వర్గం నాయకులు మండిపడ్డారు. దీనిపై మేడా మల్లికార్జున రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
రాజంపేటలో ఎమ్మెల్యేపై మండిపడ్డ జడ్పీ ఛైర్మన్ వర్గీయులు - andhra pradesh news
Dispute Between Two Groups: వైసీపీలో మరోసారి రెండు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సారి అన్నమయ్య జిల్లా రాజంపేటలో ఎమ్మెల్యే మేడ మల్లికార్జున రెడ్డిపై జడ్పీ ఛైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి వర్గం మండిపడింది. అసలు ఏం జరిగిందంటే..
రెండు వర్గాల మధ్య వాగ్వాదం