ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చర్చించిన తర్వాతే వర్క్ అడ్జెస్ట్‌మెంట్ ప్రక్రియ చేపట్టాలి: ఏపీ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్

AP Primary Teachers Association Demands: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎస్జీటీలతో చర్చించిన తర్వాతే.. ప్రభుత్వం వర్క్ అడ్జెస్ట్‌మెంట్ ప్రక్రియను చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ (అప్టా) డిమాండ్ చేసింది. సీనియారిటీ ప్రాతిపదికన టీచర్ల కేటాయింపు చేయాల్సి ఉన్నా.. జిల్లా కేంద్రంలో ఒకలా, మండల, డివిజన్లలో మరోలా ప్రక్రియ చేపట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

AP Primary Teachers
ఏపీ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్

By

Published : Jan 16, 2023, 10:04 PM IST

AP Primary Teachers Association Demands: రాష్ట్రవ్యాప్తంగా వర్క్ అడ్జెస్ట్‌మెంట్ పేరుతో ఎస్జీటీలకు పాఠశాలల కేటాయింపులో వేర్వేరు విధానాల అమలు చేయటంపై ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. పదోన్నతులు పొందిన ఎస్జీటీలకు పాఠశాలల కేటాయింపులో పాఠశాల విద్యాశాఖ నిర్దిష్ట విధానం అమలు చేయకపోవటంపై ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నాయి. ఉపాధ్యాయ సంఘాలతో చర్చించిన తర్వాతే, వర్క్ అడ్జెస్ట్‌మెంట్ ప్రక్రియ చేపట్టాలని ఏపీ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది.

అనంతరం పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌కు పీ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ లేఖ రాసింది. సీనియారిటీ ప్రాతిపదికన టీచర్ల కేటాయింపు చేయాల్సి ఉన్నా జిల్లా కేంద్రంలో ఒకలా.. మండల, డివిజన్లలో మరోలా ప్రక్రియ చేపట్టటంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఒకే తరహా విధానాన్ని అనుసరించి కౌన్సిలింగ్ విధానంలో ఎస్జీటీలకు వర్క్ అడ్జెస్ట్‌మెంట్ ప్రక్రియ చేపట్టాలని ఏపీ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ (అప్టా) డిమాండ్ చేసింది. దీనిపై ఉపాధ్యాయ సంఘాలతోనూ చర్చించాలని కోరింది.

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details